
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. తనను ప్రేమించలేదనే కోపంతో కత్తితో నరికి చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బాపుజీ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలివి.. ప్రేమ పేరుతో కిరణ్ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment