టీడీపీ పనైపోయింది... | tdp strength came down, says ap pcc chief raghuveera reddy | Sakshi
Sakshi News home page

‘ఆ పార్టీకి 20 శాతం బలం కూడా లేదు’

Published Thu, Nov 3 2016 5:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

tdp strength came down, says ap pcc chief raghuveera reddy

మడకశిర : రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని, ఆ పార్టీకి ప్రస్తుతం ప్రజల్లో 20 శాతం బలం కూడా లేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన గురువారం అనంతపురం జిల్లా మడకశిరలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం కోర్ డ్యాష్ బోర్డు’ చంద్రబాబుకు వివిధ మార్గాల ద్వారా వచ్చే ముడుపులు, కమీషన్లు చూసుకోవడానికే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. దీని వల్ల రైతులు, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

చంద్రబాబు పాలనకు జీరో గ్రేడు ఇవ్వాలని, రాజధాని నిర్మాణాన్ని ఇతర దేశాలకు అప్పగించడం వల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సొంత ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ పార్టీ కోసం బాగా పని చేస్తున్నారంటూ గ్రేడు ఇచ్చారని, అయితే.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రేడులను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement