
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. శాసనమండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట అని ఎద్దేవా చేశారు. రాజధాని సంగతి దేవుడెరుగని.. ఇప్పుడు మండలికే ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని అన్నారు. పూల ఖర్చు వృథా అయినట్టేనా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టుముట్టిందేమిటి విజనరీ? అని ఎద్దేవా చేశారు. ('పప్పు నాయుడి రాజకీయ జీవితం ముగిసినట్టే')
కాగా మరో ట్వీట్‌లో.. మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువ్వు నీతులు వల్లిస్తే ఎలా? ('కిరసనాయిలుకు ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదు')
Comments
Please login to add a commentAdd a comment