'తెలంగాణ నేతలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు'
విజయవాడ: తెలంగాణ నేతలు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నీటి విడుదలపై తెలంగాణ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశాల మేరకే సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. మంచి నీళ్లు అడిగితే నారు మడులకు నీటిని మళ్లిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. కృష్ణాబేసిన్‌లో న్యాయమైన వాటాకోసం తెలంగాణ నేతలు పోరాటం చేయాలని మంత్రి దేవినేని ఉమ సూచించారు.