సాక్షి, అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 29న సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దేవినేని ఉమాకు పలుమార్లు సీఐడీ నోటీసులు పంపించింది. అయితే, దేవినేని ఉమా సీఐడీ విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. కాగా నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై కేసు నమోదు నమోదు చేశారు.
ఈ నెల 7న ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు.
చదవండి: పరారీలో దేవినేని ఉమా..
Comments
Please login to add a commentAdd a comment