
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు' అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: దురుద్దేశంతోనే నకిలీ పీడీఎఫ్: వైవీ సుబ్బారెడ్డి
'లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం - పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు చంద్రబాబు. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ? లేని నగరాన్నే గ్రాఫిక్స్‌లో సృష్టించి వాటాలు పంచినోడివి. బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాగా మరో ట్వీట్‌లో దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. 'వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడేదీ తెలియట్లేదు ఉమకి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే. మాజీ సీఎం, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు పంచుకోవటాలు మీతోనే పోయాయి' అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..
Comments
Please login to add a commentAdd a comment