టీ.నగర్: తెన్‌కాశి జిల్లా సురండై సమీపం కళాశాల విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, టిక్‌టాక్‌లో విడుదల చేసిన యువకుని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తెన్‌కాశి జిల్లా సురండై సమీపంలోగల కూలిపత్తు అరుణాచలపురం గ్రామానికి చెందిన కన్నన్ (19). తొమ్మిది చదివి జులాయిగా తిరుగుతున్నాడు. ఇలాఉండగా, తాను తెన్‌కాశి సమీపం ప్రైవేటు కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్టు తెలిపి అనేక మంది విద్యార్థినులతో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత వారిని ఏకాంత స్థలంలో వీడియోలు తీసి మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు సోమవారం కన్నన్‌ను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.
చిన్నారుల అసభ్య వీడియోల విడుదల
హోటల్ యజమాని అరెస్టు
ఫేస్‌బుక్‌లో చిన్నారి బాలికల అసభ్య వీడియోలను పోస్ట్ చేసిన ఈరోడ్ హోటల్ యజమానిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈరోడ్ పాప్పాత్తికాడు ప్రాంతానికి చెందిన యోగేశ్వరన్ (35) అవివాహితుడు. ఇతను ఈరోడ్ మేట్టూరు రోడ్డులో హోటల్ నడుపుతున్నాడు. గత ఏడాది ఇతను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో బాలికల అసభ్య ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేశారు. దీని గురించి చెన్నిమలై పోలీసుస్టేషన్‌లో పోలీసుగా పనిచేస్తున్న ప్రకాశ్ వీరప్పన్ చత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి యోగేశ్వరన్‌ను మంగళవారం అరెస్టు చేసి, ఈరోడ్ సబ్ జైల్లో నిర్బంధించారు.
ఇంటర్నెట్‌లో అసభ్య వీడియోలు..
ఇంజినీర్ అరెస్టు
ధర్మపురిలో బాలికల అసభ్య ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ధర్మపురి జిల్లా వెన్నాంపట్టి ప్రాంతానికి చెందిన చోళరాజన్ కుమారుడు శీను (26). హొసూర్‌లోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇతను బాలికల అసభ్య ఫొటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసు ఏడీజీపీ రవికి ఫిర్యాదు అందింది. అతని ఉత్తర్వుల మేరకు పోలీసులు విచారణ జరిపి, శీనును అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment