
సినిమా: టిక్‌టాక్ రౌడీ బేబీ సూర్య సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టిక్ టాక్ ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ గా మారింది. దీంతో పలువురు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. హలో టిక్ టాక్ వీడియోలతో టిక్ టాక్ రౌడీ బేబీ సూర్య గా బహుళ ప్రాచుర్యం పొందిన యువతి అసలు పేరు లక్ష్మి. తిరువూరు కు చెందిన ఈమె పలు రకాల టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయింది. ఒక యువకుడు ప్రేమలోనూ పడి వార్తల్లోకెక్కిన సుబ్బలక్ష్మి తను ఒక హీరోయిన్ నని భావించేది. ఇటీవలే సింగపూర్ వెళ్లొచ్చిన సుబ్బలక్ష్మి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఇంటికి చేరుకుంది. అయితే ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు తెలియజేశారు. (టిక్ టాక్ ‘రౌడీ బేబీ’)
దీంతో పోలీసులు ఆమెను కరానా టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే తాను సింగపూర్‌లో ఏసీ గదుల్లో ఉండేదానినని..తనకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయాలని అక్కడి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రజల మధ్య తాను ఉండలేనని గొడవ చేసింది. ఓ విలేకరిని అసభ్య పదజాలంతో తిట్టడంతో అతను తగిన ఆధారాలతో పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సుబ్బలక్ష్మి సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో చుట్టుపక్కల వారు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సుబ్బలక్ష్మి అత్యవసర వైద్య వార్డులో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment