తిరునల్వేలి : టిక్‌టాక్ పిచ్చి అతడిని ఉన్మాదిగా మార్చేసింది. ఎన్ని వీడియోలు చేస్తున్నా లైకులు రావడం లేదనే కారణంతో ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి పాపులర్ అవ్వాలని భావించాడు. చేస్తున్నది తప్పుడు పని అని తెలిసినా.. టిక్‌టాక్‌లో పాపులారిటీ సంపాదించాలనే టార్గెట్ అతడితో దారుణం చేయించింది. అందుకు ఒక పిల్లిని పట్టుకుని దూలానికి తాడుతో వేలాడ దీశాడు. పాపం అది ఏ నేరం చేయకపోయినా.. ఉరి వేసి చంపేశాడు. ఆ వెంటనే వీడియో బాగా వచ్చిందా లేదా అని చూసుకున్నాడు. దానికికొక మ్యూజిక్ యాడ్ చేసి టిక్‌టాక్‌లో పెట్టాడు.
(వ్యక్తి చెవిలో నుంచి బుల్లెట్.. ఆపై భార్య మెడలోకి)
అతడు ఊహించినట్లే ఆ వీడియోకు వ్యూస్ వచ్చాయి. అతనిలా క్రూరంగా ఆలోచించే వాళ్లు లైక్‌లు కూడా కొట్టడం విశేషం. జంతు ప్రేమికులు, మానవత్వం ఉన్నవాళ్లు మాత్రం అతడిని పచ్చిబూతులు తిట్టారు. అయితే అతను చేసిన వీడియోనూ చూసిన కొంతమంది పోలీసులకు చూపించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా చెట్టికుళానికి చెంది తంగదురైలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు ఎస్ తంగరాజ్ అని, అతడిపై జంతుహింస, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బుధవారం అరెస్టయిన తంగరాజ్.. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment