tirunalveli
-
టిక్‌టాక్ పిచ్చిలో పిల్లికి ఉరేసి చంపాడు
తిరునల్వేలి : టిక్‌టాక్ పిచ్చి అతడిని ఉన్మాదిగా మార్చేసింది. ఎన్ని వీడియోలు చేస్తున్నా లైకులు రావడం లేదనే కారణంతో ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి పాపులర్ అవ్వాలని భావించాడు. చేస్తున్నది తప్పుడు పని అని తెలిసినా.. టిక్‌టాక్‌లో పాపులారిటీ సంపాదించాలనే టార్గెట్ అతడితో దారుణం చేయించింది. అందుకు ఒక పిల్లిని పట్టుకుని దూలానికి తాడుతో వేలాడ దీశాడు. పాపం అది ఏ నేరం చేయకపోయినా.. ఉరి వేసి చంపేశాడు. ఆ వెంటనే వీడియో బాగా వచ్చిందా లేదా అని చూసుకున్నాడు. దానికికొక మ్యూజిక్ యాడ్ చేసి టిక్‌టాక్‌లో పెట్టాడు. (వ్యక్తి చెవిలో నుంచి బుల్లెట్.. ఆపై భార్య మెడలోకి) అతడు ఊహించినట్లే ఆ వీడియోకు వ్యూస్ వచ్చాయి. అతనిలా క్రూరంగా ఆలోచించే వాళ్లు లైక్‌లు కూడా కొట్టడం విశేషం. జంతు ప్రేమికులు, మానవత్వం ఉన్నవాళ్లు మాత్రం అతడిని పచ్చిబూతులు తిట్టారు. అయితే అతను చేసిన వీడియోనూ చూసిన కొంతమంది పోలీసులకు చూపించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా చెట్టికుళానికి చెంది తంగదురైలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు ఎస్ తంగరాజ్ అని, అతడిపై జంతుహింస, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బుధవారం అరెస్టయిన తంగరాజ్.. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు. -
ప్రేమ విఫలమై.. మనసు వికలమై..
తిరునల్వేలి: తన ఇద్దరు కుమార్తెలతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడులో జరిగింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సీత(55) అనే మహిళకు సోర్న(26), పద్మ(20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాసుదేవనల్లూరు సమీపంలోని శంకుపురంలోని తమ ఇంట్లో ఈ ముగ్గురూ చనిపోయి ఉండగా ఇరుగుపొరుగువారు బుధవారం ఉదయం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురూ విషం తాగి చనిపోయినట్లు నిర్ధారించారు. వారి పక్కనే ఖాళీ సీసాలు పడి ఉన్నాయి. సోర్న ఓ యువకుడిని ప్రేమిస్తోందని, అయితే అతని తల్లిదండ్రులు వేరొక అమ్మాయితో అతనికి వివాహం నిశ్చయం చేశారని, దీన్ని తట్టుకోలేక ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వారు ఓ సూసైడ్ నోట్ రాశారని, అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురి మృతి
చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ముగ్గురు మృతి చెందగా, మరో 17మంది గాయపడ్డారు. తిరునల్వేలిలో నిర్మాణం ఉన్న చర్చ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గత రాత్రి స్లాబ్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలినట్లు తెలుస్తోంది. ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.