ప్రేమ విఫలమై.. మనసు వికలమై.. | mother, daughters suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై.. మనసు వికలమై..

Published Wed, Jan 10 2018 3:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

mother, daughters suicide

తిరునల్వేలి: తన ఇద్దరు కుమార్తెలతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడులో జరిగింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సీత(55) అనే మహిళకు సోర్న(26), పద్మ(20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాసుదేవనల్లూరు సమీపంలోని శంకుపురంలోని తమ ఇంట్లో ఈ ముగ్గురూ చనిపోయి ఉండగా ఇరుగుపొరుగువారు బుధవారం ఉదయం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురూ విషం తాగి చనిపోయినట్లు నిర్ధారించారు. వారి పక్కనే ఖాళీ సీసాలు పడి ఉన్నాయి. సోర్న ఓ యువకుడిని ప్రేమిస్తోందని, అయితే అతని తల్లిదండ్రులు వేరొక అమ్మాయితో అతనికి వివాహం నిశ్చయం చేశారని, దీన్ని తట్టుకోలేక ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వారు ఓ సూసైడ్‌ నోట్‌ రాశారని, అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement