సాక్షి, చెన్నై: ప్రియుడు వివాహానికి అంగీకరించకపోవడంతో యువతి గన్నేరుకాయలు తిని ఆత్మహత్య చేసుకుంది. కడలూరుకి చెందిన ఇలవేణి అనే యువతికి సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఓ యువకునితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పడంతో వారు తిరస్కరించారు.
ఈ క్రమంలో ఇలవేణి ప్రియుడిని కలిసి తనను వివాహాం చేసుకోవాలని కోరింది. దీనికి అతను తిరస్కరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీనిని తట్టుకోలేక ఇలవేణి గన్నేరుకాయలు తిని ఆత్మహత్యకు యత్నించింది. స్పృహ తప్పి పడి ఉన్న ఇలవేణిని కుటుంబసభ్యులు చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స ఫలించక సోమవారం ఉదయం నిలవేణి మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆదంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ప్రియుడు వివాహానికి తిరస్కరించడంతో..
Published Mon, Dec 25 2017 8:46 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment