gautam buddha nagar
-
మహిళతో సీనియర్ ఎస్పీ శృంగార సంభాషణ!
నోయిడా: ఉత్తరప్రదేశ్ గౌతంబుద్ధనగర్ ఎస్సెస్పీ వైభవ్‌కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన శృంగారపరమైన చాటింగ్ చేస్తున్న మూడు వీడియోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో ఆయన మాట్లాడిన మహిళ ఎవరో చూపించలేదు. కానీ మరో డివైస్‌తో ఆమె ఫోన్ స్క్రీన్‌ను రికార్డింగ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఈ వివాదంపై సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీసు అయిన వైభవ్ కృష్ణ స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా ఈ మార్ఫింగ్ వీడియోలును ఆన్లైన్లో స్ప్రెడ్చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది వ్యవస్థీకృత నేరాలపై, ఎక్స్టార్షన్ రాకెట్‌పై తను కఠినమైన చర్యలు తీసుకున్నానని, అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ శక్తులే ఈ విధంగా కుట్రపన్ని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ వీడియోలపై ఆన్లైన్లో లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు నోయిడా పోలీసులు ఈ వీడియో లీకేజ్ అంశంపై గుర్తు తెలియని వ్యక్తులపై అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పారదర్శక దర్యాప్తు జరిపేందుకు మీరట్ జిల్లాకు కేసును బదిలీ చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
నోయిడాలో పోకిరీల బరితెగింపు
-
మేమేం చేయలేం!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో జరగనున్న పోలింగ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫారాన్ని పొంది, నామినేషన్ వేసి, ప్రచారం చేసిన రమేశ్‌చంద్ తోమర్ సరిగ్గా ఎన్నికలకు వారంరోజుల ముందు బీజేపీలో చేరారు. నామినేషన్ గడువు కూడా ముగిసిపోవడంతో ఈ నియోజకవర్గంలో మరో అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేకుండాపోయింది. దీంతో ఈ నియోజవర్గంలో ఎన్నికలను రద్దు చేసి, కొత్త షెడ్యూల్‌ను ప్రకటించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ నోయిడాకు చెందిన ముకేశ్ యాదవ్, విక్రాంత్సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు రంజనా ప్రకాశ్ దేశాయ్, మదన్ బి లోకుర్లతో కూడిన ధర్మాసనం... ఈ సమయంలో మేమేం చేయలేమని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జితేందర్ మోహన్ శర్మ మాట్లాడుతూ... మార్చి 21న కాంగ్రెస్ అభ్యర్థిగా తోమర్ నామినేషన్ వేశారని, దీంతో పార్టీ గుర్తు ‘హస్తం’ను ఆయనకు కేటాయించారని, నియోజకవర్గంలో ఏప్రిల్ 3 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలంటూ ప్రచారం కూడా చేసుకున్నారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి, బీజేపీలో చేరారని చెప్పారు. అప్పటికే నామినేషన్ గడువు, ఉపసంహరణ తదితర ప్రక్రియలన్నీ ముగిసిపోవడంతో సదరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకుండా పోయాడన్నారు. అందుకే నియోజకవర్గంలో ఎన్నికలను నిలిపివేసి, కొత్తగా షెడ్యూల్ ప్రకటించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతున్నామన్నారు. బహుముఖ పోరే... ఎన్సీఆర్ విషయానికి వస్తే... గుర్గావ్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీల మధ్య చతుర్ముఖ పోరు, ఘాజియాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, ఎస్పీ, బీఎస్పీల మధ్య బహుముఖపోరు జరుగనుంది. గౌతమ్‌బుద్ధ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌చంద్ తోమర్ బీజేపీలో చేరడంతో ఆప్, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోరుప్రధానంగా ఎస్పీ, బీజేపీల మధ్యనే నెలకొంది. తమ పార్టీ అభ్యర్థి ఎన్నికల నుంచి నిష్ర్కమించినందువల్ల పోటీలో తమ పార్టీ అభ్యర్థి లేకుండా పోయాడని, అందువల్ల ఇక్కడి రద్దు చేసి ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో ఇక్కడ కూడా నేడే పోలింగ్ జరగనుంది. -
గౌతమ్‌బుద్ధ్‌నగర్ ఎన్నికల చిత్రం కర్షకులే నిర్ణేతలు..!
సాక్షి, న్యూఢిల్లీ: నోయిడా, గ్రేటర్ నోయిడా వంటి పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలను తనలో కలుపుకున్న గౌతమ్ బుద్ధ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది రైతులే. బహుముఖ పోటీ నెలకొన్న ఈ నియోజకవర్గం ఓటర్లలో 70-80 శాతం రైతులు, గ్రామీణులు కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న భూములకు రైతులు అధిక నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తుండడంతో.. ఇదే ఈ నియోజకవర్గం ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారింది. నష్టపరిహారాన్ని ఆరు రెట్లు పెంచాలని, కొత్తగా సేకరించే భూమి కోసం కొత్త విధానాన్ని రూపొందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడాలు ఆధునిక హంగులను సమకూర్చుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని వారు అంటున్నారు. రైతుల మద్దతుపైనే తమ విజయం ఆధారపడి ఉందని గుర్తించిన ప్రధాన రాజకీయ పార్టీలు రైతుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఉద్దేశమని అంటున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఈ హామీకి ఏమాత్రం పొంతనలేని రీతిలో నోయిడా, గ్రేటర్ నోయిడా వాసుల సమస్యలు ఉన్నాయి. అపార్ట్మెంట్లు, సువిశాలమైన రోడ్లు, మాల్స్, ఎఫ్1 సర్క్యూట్ వంటి అంతర్జాతీయ హంగులున్న ఈ ప్రాంతంలో విద్యుత్తు కొరత ప్రధాన సమస్యగా ఉంది. అభ్యర్థులు వీరే... మొత్తం 17.34 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో వృత్తి రీత్యా వైద్యుడైన డాక్టర్ మేహ ష్ శర్మకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ రమేష్ చంద్ర తోమర్‌ను, సమాజ్‌వాదీ పార్టీ నరేంద్రసింగ్ భాటీని భట్‌ను నిలబెట్టాయి. ఈ ముగ్గురు అభ్యర్థులు 2009 ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన సురేంద్ర సింగ్ నాగర్ చేతిలో ఓడిపోయారు. ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన సతీష్ అవానాను అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నోయిడాకు చెందిన వ్యాపారవేత్త కేపీ సింగ్‌ను నిలబెట్టింది.