లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్‌ | Actress Rohini Fires On Senior Journalist, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్‌

Published Sat, Jul 13 2024 1:12 PM | Last Updated on Sat, Jul 13 2024 2:56 PM

Actress Fires On Senior Journalist

బుల్లితెరతో పాటు వెండితెరపై తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్న నటి రోహణి తాజాగా ఓ జర్నలిస్ట్‌పై ఫైర్‌ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా పర్సనల్‌ లైఫ్‌ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్‌ చేసింది.

అసలేం జరిగింది?
రోహిణి తాజాగా ‘బర్త్‌డే బాయ్‌’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం రేవ్‌ పార్టీ థీమ్‌తో ఓ ప్రాంక్‌ వీడియో చేసింది. అది కాస్త నెట్టింట బాగా వైరల్‌ అయింది. అయితే ఇది కేవలం ప్రమోషన్స్‌ కోసమే చేసినట్లు వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కానీ కొంతమంది రోహిణి నిజంగానే రేవ్‌ పార్టీలో దొరికిపోయిందని ట్రోల్‌ చేశారు. ఇక ఇదే వీడియోపై ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఓ చానల్‌లో మాట్లాడుతూ..రోహిణి లాంటి వాళ్లు రేవ్‌ పార్టీలో పాల్గొన్నారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అంతేకాకుండా తన పర్సనల్‌ లైఫ్‌పై కూడా కామెంట్‌ చేయడం పట్ల రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది.  

‘నేను బర్త్ డే బాయ్ అనే సినిమాకి ప్రమోషన్స్ చేశాను. అది వీడియో ప్రమోషనల్ కోసం చేశానని తెలుసుకొని మీడియా కూడా దానిని ఫన్నీ వీడియోగా తీసుకున్నారు.  కానీ, సీనియర్ జర్నలిస్ట్ నా గురించి తప్పుగా మాట్లాడారు. ఏదైనా సంఘటన గురించి మాట్లాడేటప్పుడు అది నిజమా? కాదా? అనేది తెలుసుకొని మాట్లాడాలి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్‌ చేయకూడదు. 

నేను మందు కూడా తాగను. సినిమాల్లో భాగంగా కొన్ని సీన్స్‌లో అలా కనిపించినంత మాత్రాన బయట అలా చేస్తామా?. ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవడం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావు గా ఉంటే పెళ్లి కాదా.? సీనియర్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను.  ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని’అని రోహిణి సీరియస్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement