డ్రగ్స్‌ కేసు: ఐదుగురి చుట్టూ సాగుతున్న దర్యాప్తు | Fooding And Mink Pub Case: Police Continue Investigation Hyderabad | Sakshi
Sakshi News home page

Drugs Case: ఐదుగురి చుట్టూ సాగుతున్న దర్యాప్తు

Published Sat, May 7 2022 7:42 AM | Last Updated on Sat, May 7 2022 10:00 AM

Fooding And Mink Pub Case: Police Continue Investigation Hyderabad - Sakshi

సాక్షి, హైదరబాద్‌: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ ఆధీనంలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో జరిగిన రేవ్‌ పార్టీ కేసులో హైదరాబాద్‌ పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆ రోజు కొకైన్‌ డ్రగ్‌ను ఐదుగురే వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీన్ని నిర్థారించడానికి అవసరమైన ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఆ రోజు పట్టుబడిన 128 మందిలో 45 మందికి ‘డ్రగ్‌ చరిత్ర’ ఉన్నట్లు గుర్తించారు.

గతంలో మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్టు అయిన వారితో వీరికి సంబంధాలు ఉండటంతో వీరందరికీ నోటీసులు జారీ చేసి విచారించారు. ఈ విచారణతో పాటు ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా రేవ్‌ పార్టీకి ఐదుగురే బాధ్యులని గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటి కోసం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు.

చదవండి: సరూర్‌నగర్‌ పరువు హత్యపై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement