ఎస్‌టీఎఫ్ అధికారుల దాడి.. ఐదుగురు అరెస్ట్
రూ. 1.5 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు, విదేశీ మద్యం స్వాధీనం
హఫీజ్‌పేట్: మాదాపూర్‌లో రేవ్ పారీ్టపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అధికారులు దాడి చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ కె.వై.ఖురేషి, ఎస్‌టీఎఫ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు గురువారం శేరిలింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ (31) ఆధ్వర్యంలో మాదాపూర్ సైబర్ టవర్స్ వెనక ఉన్న క్లౌడ్ 9 హోమ్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో జన్మదిన వేడుకల్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ నెల 12న నాగరాజు గోవా నుంచి 3 గ్రాముల కొకైన్‌ను తెప్పించి మోకిలకు చెందిన నితిన్ (24)కు అందించాడు. బేగంపేటకు చెందిన సాయికుమార్ యాదవ్ (27) విదేశాల నుంచి మద్యం తీసుకురాగా, బంజారాహిల్స్‌కు చెందిన సీహెచ్ కిషోర్ (28) రేవ్‌పార్టీకి కోసం సరీ్వస్ అపార్ట్‌మెంట్ బుక్ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి ఎస్‌ఐలు బాల్‌రాజ్, సంధ్యల బృందం రేవ్‌పార్టీపై దాడి చేసి 14 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులోకి తీసుకుంది.
వారి నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే కొకైన్ (1 గ్రాము), ఎండీఎంఏ (2 గ్రాములు), ఓజీ కుష్(1 గ్రాము)తోపాటు 12 విదేశీ మద్యం సీసాలు, 36 బీర్ సీసాలు, ఒక ఇన్నోవా కారును స్వా«దీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహించిన నాగరాజుతోపాటు మత్తుపదార్థాలు సరఫరా చేసిన సాయికుమార్ యాదవ్, ఇమాన్యుల్, సీహెచ్ కిషోర్, నితిన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మిగతా 15 మందిని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. రేవ్‌పారీ్టలో పట్టుబడ్డ ఐదుగురు యువకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎబాన్ యూరిన్ టెస్ట్ అనే నూతన పరికరంతో పరీక్షలు చేశారు. ఈ పరీక్షతో కేవలం 5 నిమిషాల్లోనే సదరు వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment