
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో గత సోమవారం రాత్రి రేవ్ పార్టీ కలంకలం రేపిన సంగతి తెలిసిందే. గొలుగొండలోనే మరొక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గురువారం రాత్రి గొలుగుండ సమీపంలో బహిరంగంగా అర్ధ నగ్న డాన్స్‌లు నిర్వహించారు. గంజాయి, అమ్మాయిలతో విచ్చలవిడిగా రేవ్ పార్టీ జరిగిన కానీ, పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.
ఈ రేవ్ పార్టీలో నలుగురు అమ్మాయిలు పాల్గొన్నారు. గంజాయి మత్తులో పార్టీలో యువకుల మధ్య కొట్లాట జరిగింది. దీంతో పార్టీలో ఓ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులను మందలించి పంపించివేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. రేవ్ పార్టీలో మైనర్లు కూడా పాల్గొన్నారు. దీంతో తల్లి దండ్రుల ఆందోళన పడుతున్నారు. పోలీస్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment