SRK's son Aryan Khan Being Questioned In Drug Case: ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) శనివారం రాత్రి దాడి చేసింది. పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక రేవ్ అందులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, మరికొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ ఫోన్, మరికొందరి ఫోన్లను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా విచారిస్తే కేసులో కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది.
దాంతోపాటు ఆర్యన్ ఖాన్‌తోపాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా ఎన్‌సీబీ అధికారులు విచారించనున్నారు. క్రూయిజ్ పార్టీలో చేరడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల కుమార్తెలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్రూయిజ్ పార్టీ ఆర్గనైజర్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఎఫ్‌టీవీ డైరెక్టర్ ఖాసిఫ్ ఖాన్ పర్యవేక్షణలోనే ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోందని ఎఫ్‌టీవీ అధికారులు పేర్కొన్నారు.
చదవండి: దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్
Comments
Please login to add a commentAdd a comment