బిగ్ బీ జల్సాలోకి దర్జాగా దూరిన అతిథి! | Snake in Amitabh Bachchan's residence Jalsa | Sakshi
Sakshi News home page

బిగ్ బీ జల్సాలోకి దర్జాగా దూరిన అతిథి!

Published Wed, Apr 9 2014 1:47 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

బిగ్ బీ జల్సాలోకి దర్జాగా దూరిన అతిథి!

బిగ్ బీ జల్సాలోకి దర్జాగా దూరిన అతిథి!

సెలబ్రిటీలు, ప్రముఖుల ఇంటికి వెళ్లాలంటే అభిమానులకు ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకపోతే కనీసం సెక్యూరిటీ గేటు కూడా అభిమానులు దాటలేరు. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఓ అతిథి దర్జాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లోకి వెళ్లిపోయింది. ఎవరి ఇంట్లోకైనా ఏమాత్రం సంకోచం లేకుండా తాను వెళ్లగలనని మరోసారి నిరూపించింది. ఇంతకీ ఆ అతిథి ఎవరని చూస్తున్నారా... అదో పాము!!
 
 
ముంబైలోని బిగ్ బీ నివాసం 'జల్సా'లోకి బుధవారం నాడు ఓ పాము ప్రవేశించింది. అమితాబ్ సిబ్బంది దాన్ని గమనించి.. పాముల్ని పట్టేవారికి సమాచారం అందించారు. వెంటనే వాళ్లు అక్కడకు చేరుకుని, దాన్ని అడవిలో వదిలినట్టు అమితాబ్ తన బ్లాగ్ లో రాశారు. కాంక్రీట్ జంగల్ గా పేరున్న ముంబై నగరంలో.. అదీ బిగ్ బీ నివాసముండే అత్యంత రద్దీ ప్రదేశంలో పాములు ప్రవేశించడం కొంచెం ఆశ్చర్యకరమే. ప్రస్తుతం అమితాబ్ శుక్రవారం విడుదల కానున్న 'భూత్ నాథ్ రిటర్న్' అనే చిత్ర ప్రమోషన్ లో ఢిల్లీలో బిజీగా ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement