Make-up artist
-
కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఓ రైల్వే కూలీ చేతికి సుమారు రూ. 1.4 లక్షల ఫోన్ దొరికింది. ఐతే అతను ఆ ఫోన్‌ని నేరుగా రైల్వే పోలీసులకు ఇచ్చేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ స్టేషన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దశరత్ దౌండ్ అనే రైల్వే కూలి దాదార్ రైల్వే స్టేషన్లో కూలీగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతని రోజువారీ సంపాదన రూ. 300. ఐతే అతను ఎప్పటిలానే ఆరోజు కూడా అమృత్‌సర్‌కి వెళ్లే రైలు ఆగి ఉన్న ఫ్లాట్ ఫాం 4 వద్ద తన పనిని ముగించుకుని ఇంటికి పయనమవుతున్నాడు. ఆ క్రమంతో రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఒక ఖరీదైన ఫోన్ కనిపించింది. అది ఫ్లాట్‌ఫాంపై నడుస్తుండగా సీటింగ్ ఏరియాలో పడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులను ఆ ఫోన్ గురించి వాకబు చేస్తే మాది కాదనే చెప్పారు. దీంతో దశరత్ నేరుగా రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పి ఆ ఫోన్‌ని ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఫోన్ ఎవరిదని అని ట్రేస్ చేస్తుండగా..అది అమితాబచ్చన్‌కి విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్‌కి చెందన ఫోన్ అని తేలింది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ని బాధితుడు సావంత్‌కి అందజేసి ఈ విషయం చెప్పడంతో అతను ఒక్కాసారిగా ఆశ్చర్యపోయాడు. తన ఫోన్ తనకు తిరిగి లభించినందుకు బహుమతిగా ఆ కూలికి రూ. 1000 కూడా ఇచ్చాడు సావంత్. ఆ కూలీని పోలీసుల తోపాటు సావంత్ కుటుంబం కూడా ఎంతగానో ప్రశంసించింది. ఈ మేరకు కూలీ దశరత్ మాట్లాడుతూ.. ఈ ఘటనను మర్చిపోయానని, సడెన్‌గా పోలీసుల నుంచి కాల్ రావడంతో ఈ విషయం గురించి తెలిసిందని చెబుతున్నాడు. అయినా తనకు గాడ్జెట్లపై ఎలాంటి అవగాహన లేదని, పైగా తాను ఎవరి వస్తువుని తన వద్ద ఉంచుకోనని చెప్పాడు. ఏదీఏమైనా ఇలాంటి వ్యక్తులు ఉండటం అత్యంత అరుదు. (చదవండి: క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి.. పేరెంట్స్ అరెస్టు) -
శ్రీదేవి చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా..
‘శ్రీదేవి ఇకలేరు అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నా. మోహిత్ మర్వా పెళ్లిలో శ్రీదేవికి మేకప్ కోసం నేను దుబాయ్‌లోనే ఉన్నా. పెళ్లి వేడుకలో ఎప్పటిలాగే ఆమె ఎంతో అందంగా, ఆనందంగా, ఉజ్వలంగా కనిపించారు. ఆ తర్వాత నేను దుబాయ్ నుంచి భారత్ తిరిగి వచ్చాను. శనివారం రాత్రి నుంచి ఆమె చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నాను’ అని చివరిగడియల్లో శ్రీదేవితో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ సుభాష్ షీండే చెప్పిన మాటలివి. దుబాయ్‌లో తన మేనల్లుడు మోహిత్ మర్వా పెళ్లిలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి ఆకస్మికంగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహిత్ మర్వా పెళ్లికోసం శ్రీదేవితోపాటు దుబాయ్ వెళ్లి మేకప్ అందించిన షీండే ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో మాట్లాడారు. ఆమె చివరిగడియల్లోనే ఎంతో ఉత్సాహంగా కనిపించారని తెలిపారు. శ్రీదేవి నటించిన ‘పులి’, ‘మామ్’ సినిమాలకు షీండే మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. శ్రీదేవి ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో, ఉత్సాహంతో ఉండేవారని, సినిమా సెట్స్‌లో ఉన్న మేకప్ ఆర్టిస్టులు మొదులుకొని అందరినీ కుటుంబసభ్యులలాగా చూసుకునేవారని ఆయన తెలిపారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా నుంచి తాను ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. సమయానికి భోజనం చేస్తున్నావా? మీ కుటుంబసభ్యులు ఎలా ఉన్నారు వంటి క్షేమసమాచారాలను ఆమె తనను అడిగేదని చెప్పారు. ‘శ్రీదేవి మంచి పెయింటర్. కలర్స్, షేడ్స్ గురించి ఆమె గొప్ప అవగాహన ఉంది. వస్త్రాల కలర్స్, వాటి కాంబినేషన్ విషయంలో నేను ఆమెను అడిగి తెలుసుకునేవాణ్ని. ఆమెకు గొప్ప కళాత్మక దృష్టి ఉంది’అని షీండే వివరించారు. రంగులు, బంగారు అభరణాలు, చివరికి తాను పెట్టుకున్న బొట్టుబిల్లా (బిందీ) వరకు ప్రతి వివరాన్ని ఆమె అడిగి తెలుసుకునేవారని చెప్పారు. మేకప్ సెషన్లో శ్రీదేవి ఎంతో ఓపికతో ఉండేవారని, ఆమె ఎంతో సహకరించేవారని తెలిపారు.‘పులి చిత్రం సమయంలో ఆమె భారీ మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో కూడా ఆమె ఎప్పుడూ రుసరుసలాడటం లాంటిది చేయలేదు. మేకప్ కోసం ఎంతో సమయం తీసుకున్నా.. ఎంతో ఓపికగా మాకు ఆమె సహకరించేది’ అని ఆయన వివరించారు. -
సిటీకి కొత్తందం!
►400 నగరంలో నెలకు జరిగే ప్లాస్టిక్ సర్జరీలు ►60% ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొనేవారిలో అబ్బాయిల సంఖ్య ►500 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 40 ఏళ్ల పైబడ్డవారు ►3500 ఏడాదిలో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్న వారిలో 30 ఏళ్లలోపు యువకుల సంఖ్య అందమనేది తాత్కాలికం కాకూడదు.. అది శాశ్వతంగా మనకే సొంతం కావాలి. ఇన్నాళ్లూ ఇలా ఉండిపోవచ్చు, కానీ ఇకపై మనల్ని చూస్తే కళ్లు తిప్పుకోకూడదు.. అందరి దృష్టినీ ఆకర్షించాలి. బ్యూటీపార్లర్లలో ఫేషియల్సూ, మేకప్ ఆర్టిస్టుల క్రియేటివిటీ తాత్కాలికం.. అందం మనవద్ద లేదనేది గతం. అలా ఉండకూడదనుకుంటే ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదిద్దాం.. యవ్వనం మరింతకాలం పదిలంగా ఉండాలంటే వేరే మార్గం లేదు.. ఇదీ నగర యువత ఆలోచన. కళ్లూ, ముక్కూ, పొట్ట, హెయిర్స్టైలూ ఇవన్నీ సహజత్వంలో కాస్త బాగాలేకపోవచ్చు. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు కదా అంటున్నారు కొత్తతరం యువత. అందంగా ఉన్నామంటే దాన్నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం కూడా బోల్డెంత ఉంటుందనేది ఆలోచన. చప్పిడిముక్కు, బాల్డ్‌హెడ్, నడుముల కింద టైర్లు, బట్టతల వంటి మాటలకు కొత్త అర్థాలు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో అందంగా ఉండాలన్న స్పృహ బాగా పెరిగిందని, ఇలాంటి సర్జరీలు చేయించుకుంటున్నవారిలో 80 శాతం మంది పెళ్లికి ముందు వస్తున్నవారేనని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డా.వెంకటరమణ అంటున్నారు. ముప్ఫై ఏళ్ల వయసు లోపే.. ►ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీరాకృతిని మార్చుకోవాలని కోరుకుంటున్న వారిలో 80 శాతం మంది 30 ఏళ్ల లోపువారే. వారిలోనే ఎక్కువ మంది పెళ్లికి ముందు వస్తున్న వారే. ►ఆకృతిని మార్చుకునే వారిలో ముక్కు (రినోప్లాస్టీ), నడుముల కింద ముడతలు, లాసిక్ (కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ ఎక్కువ. ►ఈ మధ్య కొవ్వులు తొలగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ►శరీరాకృతి ముఖ్యంగా నడుముకింద ముడతలు తొలగించుకోవాలని అనుకుంటున్న వారిలో అబ్బాయిలు ఎక్కువ. ►ముక్కు సరిచేసుకునే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. దీన్నే షేప్ కరక్షన్ అంటారు. ►మొటిమలు పోయాక ఏర్పడ్డ మచ్చలు తొలగించుకున్న వారి సంఖ్య పెళ్లికి ముందు వస్తున్న వారిలో ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు లేకపోతే ఎలా ► సాధారణంగా ఏదైనా జబ్బుకు శస్త్రచికిత్స జరిగితే భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్లుకూడా తీసుకోవాల్సి ఉంది. ► ఉదాహరణకు నడుముకింద ముడతలు తొలగించుకునేందుకు కొవ్వులు తీస్తాం. ఆ తర్వాత మళ్లీ రాకుండా చూసుకునేందుకు జీవనశైలి మార్చుకోవాలి. లేదంటే మళ్లీ కొవ్వులు ఏర్పడితే దానికి అర్థమేముంటుంది? ► నాణ్యమైన ఉపకరణాలు, శస్త్రచికిత్సల విధానాలు వచ్చాక చాలా వరకూ ఇలాంటి ►సర్జరీలు సక్సెస్ అవుతున్నాయి. అది కూడా డాక్టర్ని బట్టి ఉంటుంది. ►చాలామందిలో ఇలాంటివి చేయించుకున్నాక ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ► శరీరాకృతిని కాపాడుకోవడానికి వ్యాయామం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ప్రెజెంటేషన్ : జి.రామచంద్రారెడ్డి