బర్త్ డేకి మూతి ముడిచేశారు! | Amitabh Bachchan remembers his rebirth today, 33 years after he suffered a near-fatal accident on 'Coolie' | Sakshi
Sakshi News home page

బర్త్ డేకి మూతి ముడిచేశారు!

Published Mon, Aug 3 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

బర్త్ డేకి  మూతి ముడిచేశారు!

బర్త్ డేకి మూతి ముడిచేశారు!

 ‘‘నాకోసం ఆ భగవంతుడికి చేతులు జోడించి, ప్రార్థించిన వ్యక్తులందరికీ నా ధన్యవాదాలు’’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందుకలా అన్నారు?.. ఆ విషయంలోకే వద్దాం. ఆగస్ట్ 2 అమితాబ్ బచ్చన్ జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. అదే రోజు ఘోరమైన ప్రమాదానికి కూడా గురయ్యారు. 1982లో  బర్త్‌డే నాడు ‘కూలీ’ షూటింగ్‌లో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగింది.

అప్పుడు అమితాబ్‌కి బాగానే దెబ్బ తగిలింది. వెంటనే చిత్రబృందం ఆస్పత్రిలో చేర్చడం, ఆ ప్రమాదం కారణంగా ఆయన రెండు నెలలు విశ్రాంతికి పరిమితం కావడం జరిగింది. అందుకే అమితాబ్ ఆగస్ట్ 2 తనకు పునర్జన్మలా భావిస్తారు. ఆదివారం పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ‘కూలీ’ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇంటిల్లిపాదీ అమితాబ్ పుట్టినరోజు నాడు బాగానే సందడి చేశారు. అమితాబ్, అభిషేక్ అయితే చిన్నపిల్లల్లా మారిపోయి, ఎంజాయ్ చేశారు. మూతి ముడిచేసి, సెల్ఫీలు దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement