kalkutta
-
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
పర్స్‌లు కొట్టేస్తూ పోలీసులకు చిక్కిన నటి, విచారణలో షాకింగ్ విషయాలు
Actress Rupa Dutta Arrested For Theft Wallets: ప్రముఖ టీవీ నటి దొంగతనానికి పాల్పడిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. బెంగాలీ టీవీ నటి రూపా దత్త ఓ బుక్ఫేయిర్లో చోరీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో కలకత్తా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త బెంగాలీ సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాలు.. బెంగాలీ సీరియల్స్‌తో రూపా దత్తా నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో కలకత్తాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ఫేయిర్లో ఖాళీ పర్సు చెత్త బుట్టలో పడేస్తూ పోలీసులకు చిక్కింది. చదవండి: Poonam Kaur: ప్రభాస్ అలాంటి వాడు, పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా.. బ్యాగ్‌లో ఎన్నో వ్యాలెట్లు భయపడ్డాయి. అందులో రూ. 70వేలకు పైగా నగదు ఉంది. దీంతో ఆ నగదుతో పాటు ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని రూపాను విచారించారు. ఈ క్రమంలో ఆమె అసలు విషయం చెప్పిందని, తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు కలకత్తా పోలీసులు తెలిపారు. డబ్బుతో బయటపడిన డైరీ పలు సంచలన విషయాలు వెలుగు చూశాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్.. పోస్టర్ రిలీజ్ రూపా దత్తాకు చోరీ చేయడం కొత్తేమి కాదని, అంతకుముందు చాలా సార్లు చోరీలు చేసిందని, వాటికి సంబధించిన వివరాలన్నీ డైరీలో రాసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని రూపా కూడా అంగీకరించింది. కోల్‌కతాలోని రద్దీ ప్రదేశాలలో పిక్ ప్యాకెట్స్ చేసేదాన్ని అని, డబ్బు కోసం ఇలా చేయాల్సివచ్చిందని తెలిపింది. దీంతో ఆమెపై పలు కేసులు నమోదు చేసి ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల రూపా దత్తా లైంగిక ఆరోపణలు చేసి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. -
దాల్మియాతో సమాచార లోపం లేదు
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాతో తనకు ఎలాంటి సమాచార లోపం లేదని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అలాగే ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. దాల్మియా అనారోగ్యంతో ఉండడంతో కార్యకలాపాలన్నీ ఠాకూర్ ద్వారానే నడుస్తున్నాయని ఇటీవల లోధా కమిటీ అభిప్రాయపడినట్టు కథనాలు వచ్చాయి. అయితే ఠాకూర్ వీటిని తోసిపుచ్చారు. ‘ మేం ఎన్నికైన తొలి రోజు నుంచి భేషుగ్గా కలిసిపనిచేస్తున్నాం. బోర్డులో పారదర్శకత, విశ్వసనీయత పెంచాం. ప్రతీ సెలక్షన్ కమిటీ అనంతరం మేమిద్దరం మీడియాతో సంభాషిస్తున్నాం. అలాగే ప్రతీ సమావేశం తర్వాత సమన్వయంతో పత్రికా ప్రకటనలిస్తున్నాం’ అని తేల్చారు. -
30 ఏళ్లుగా అదే వ్యసనం..
కోల్‌కతా: క్రికెట్ స్టేడియాల్లో కనిపించే వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ లాగే ఫుట్‌బాల్‌లోనూ భారత్‌లో ఓ అభిమాని ఉన్నాడు. కోల్‌కతాకు చెందిన బాపి మజీ అనే అభిమానికి మో హన్ బగాన్ క్లబ్ అంటే పిచ్చి. ఎంతగా అంటే గత 30 ఏళ్లుగా ఈ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లను స్టేడియంలో కూర్చుని మరీ చూస్తున్నాడు. దీని కోసం సొంత డబ్బులతో దేశమంతా తిరిగాడు. ఇంతా చేసి ఇతడేమైనా ధనికుడా అంటే అంత సీన్ లేదు. నార్త్ కోల్‌కతాలోని పాయిక్పారా అనే ప్రాంతంలో చిన్న టీకొట్టే ఇతడికి జీవనాధారం. పర్యటనల కోసం డబ్బు ఇబ్బందిగా ఉందని నాలుగేళ్ల క్రితం కుటుంబానికి చెందిన రెండు గదులను అమ్మేశాడు. ఆ డబ్బులు కూడా అయిపోయాక భార్యకు చెందిన నగలను కుదువపెట్టి మరీ మ్యాచ్‌లను చూశాడు.