బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాతో తనకు ఎలాంటి సమాచార లోపం లేదని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అలాగే ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. దాల్మియా అనారోగ్యంతో ఉండడంతో కార్యకలాపాలన్నీ ఠాకూర్ ద్వారానే నడుస్తున్నాయని ఇటీవల లోధా కమిటీ అభిప్రాయపడినట్టు కథనాలు వచ్చాయి.
అయితే ఠాకూర్ వీటిని తోసిపుచ్చారు. ‘ మేం ఎన్నికైన తొలి రోజు నుంచి భేషుగ్గా కలిసిపనిచేస్తున్నాం. బోర్డులో పారదర్శకత, విశ్వసనీయత పెంచాం. ప్రతీ సెలక్షన్ కమిటీ అనంతరం మేమిద్దరం మీడియాతో సంభాషిస్తున్నాం. అలాగే ప్రతీ సమావేశం తర్వాత సమన్వయంతో పత్రికా ప్రకటనలిస్తున్నాం’ అని తేల్చారు.
దాల్మియాతో సమాచార లోపం లేదు
Published Sun, Jul 5 2015 12:46 AM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM
Advertisement
Advertisement