పేజీలు: 202; వెల: 150
ప్రతులకు: లిఖిత ప్రెస్, కేరాఫ్ వై.నిర్మల, హెచ్‌ఐజి-2, బ్లాక్-12, ఫ్లాట్-1, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44;
ఫోన్: 040-27660000
పుస్తకం : {పవాహం
జానర్ : నాన్‌ఫిక్షన్/వ్యాసాలు
రచన : సజయ
విషయం : మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే?! ‘మౌనం’ అర్థంగీకారం కాదు. అనర్థదాయకం. ఈ పుస్తకంలో మనకు అలాంటి ‘మౌనం’ ఎక్కడా తారసపడదు. ఒక ప్రవాహ శబ్దం నలుదిశలా వినిపిస్తుంది. మనల్ని మనలోకి, లోకాన్ని మనలోకి తీసుకెళుతుంది.
స్త్రీవాద ఉద్యమాల్లో పని చేస్తున్న సజయ వివిధ సందర్భాలలో సామాజిక విషయాలపై చేసిన చర్చలు, ఆలోచనలు, కార్యచరణ... ఈ పుస్తకానికి పునాది. పడికట్టు సైద్ధాంతిక పదాలు లేకుండా స్పష్టమైన వాక్యాలతో రాయడం బాగుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న కథలు చదివిననట్లుగా ఉంటుంది.
ఈ పుస్తకంలో ఆయా సందర్భాలకు చెందిన వ్యాసాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాలేవి గతం కాదు. వర్తమానంలోనూ వాటి ‘కాలం’ తీరిపోయేది కాదు. రచయిత్రి వ్యక్తిగత అనుభవాలు కూడా ఆసక్తి దాయకంగా ఉన్నాయి. ఉదా: ఏది ప్రధానం? ఏది అప్రధానం? (పే:7)
నాటకాల దగ్గరి నుంచి చట్టాల వరకు ఎన్నో సామాజిక విషయాల వరకు చర్చించిన వ్యాసాలివి. రోజు వారి జీవితంలో మనకు కనిపించని చీకటిని ఈ అక్షరాల వెలుగులో చూడొచ్చు.
- వై.పి.
సందేశాత్మక కథాసుగంధం
పేజీలు: 108; వెల: 60
ప్రతులకు: రచయిత,
9-59, రవినగర్, వేపగుంట పోస్ట్, విశాఖపట్నం-47ఫోన్: 9437581728
పుస్తకం : గంధం చెట్టు
జానర్ : ఫిక్షన్/ కథలు
రచన : గన్నవరపు నరసింహమూర్తి
విషయం : సమకాలీన సమస్యల సందేశాత్మక 15 కథల సంపుటి ‘గంధం చెట్టు’. వీటిలో నక్సలైట్ ఉద్యమాల మూలాలు సామాజిక రుగ్మతల్లో ఉన్నాయని ‘మోదుగు పూలు’, ‘పులి చంపిన లేడి నెత్తురు’ల్లో చిత్రించాడు. పోలీస్ అధికారి తొందరపాటు వల్ల చనిపోయిన వ్యక్తి సోదరుడి చదువును బాధ్యతగా భావించడం చక్కని పరిష్కారంతో కూడిన ముగింపు. సాఫ్ట్‌వేర్ భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాల కథనం ‘మంచు గోడలు’. భార్య పదోన్నతి వల్ల దంపతుల్లో తారాస్థాయికి చేరిన మనస్పర్థలు, భర్త సంయమనంతో మంచు గోడల్లా కరిగిపోయాయన్న ముగింపు సందేశాత్మకంగా ఉంది. ‘ఊబి’ కథలో అమెరికా ఆర్థిక మాంద్యం వల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో వచ్చిన అభద్రతాభావాన్ని చిత్రించాడు. శీర్షిక కథ ‘గంధం చెట్టు’లో అయ్యర్ పాత్రను మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చిత్రించాడు. కథలన్నింటా మానవ సంబంధాల గుణాత్మక మార్పులు గుబాళిస్తున్నాయి.
- డా॥పి.వి.సుబ్బారావు
నిత్యజీవితంలో భారతం
పేజీలు: 136
వెల: 150
పుస్తకం : మనస్సాక్షి మహాభారతం
జానర్ : నాన్‌ఫిక్షన్/వ్యాసాలు
రచన : డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
విషయం : ‘మహాభారతంలో ఉన్నదే మానవలోకంలో ఉంది. మానవలోకంలో ఉన్నదే మహాభారతంలో ఉంది’ అంటూ నిత్యజీవితానికి పనికొచ్చే సందేశాలను మూడేళ్లపాటు సాక్షి పాఠకులకు అందించారు రచయిత. తానెంచుకున్న ఇతివృత్తాలన్నీ భారతంలోనుంచే కాబట్టి, ‘మనస్సాక్షి మహాభారతం’గా పుస్తక రూపమిచ్చారు. ‘జీవన భారతం’తో ఆరంభించిన ఈ పుస్తకంలో 90కి పైగా భారతేతర అంశాలున్నాయి. తొలేకాదశి, వినాయకచవితి, విజయదశమి లాంటి పర్వదినాల ఆసక్తికర విశేషాలు పొందుపరిచారు.
- డి.వి.ఆర్.
కొత్త పుస్తకాలు
గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు
రచన, కూర్పు: సి.హెచ్.హరిబాబు
పేజీలు: 642; వెల: 300
ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌజ్, చిక్కడపల్లి, హైదరాబాద్-20.
ఫోన్: 040-27608107
అంతటి నరసింహం నవలలు - సంఘ సంస్కరణ దృక్పథం
రచన: డా.పోతిరెడ్డి చెన్నకేశవులు
పేజీలు: 132; వెల: 100
ప్రతులకు: సి.ఇందిర, 34/బి, పి.ఎస్.నగర్, హైదరాబాద్-57. ఫోన్: 040-23347433
1. అమ్మా నాన్న పిల్లలు (వ్యాసాలు)
పేజీలు: 42; వెల: 50
2. నా మినీ కథలు
పేజీలు: 50; వెల: 50
రచన: ఎనుగంటి వేణుగోపాల్
ప్రతులకు: ఎ.అంజలి, ఇం.నం. 1-3-168/1, కృష్ణానగర్, జగిత్యాల, కరీంనగర్-505327
శ్రీ సాధన కవిత్వం (1926-1947)
సంకలనం: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి
పేజీలు: 112; వెల: 40
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
ప్రతులకు: శ్రీ లలితా త్రిపురసుందరీ ధార్మిక పరిషత్, 76-8/1-28, లలితానగర్, భవానీపురం, విజయవాడ-12. ఫోన్: 0866-2414322.
సమీక్షణం: ప్రవాహ పదధ్వని విందాం...
Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement