Stalls
-
కలుపు తీస్తుంది.. ఎరువు జల్లుతుంది!
సాక్షి, రంగారెడ్డిజిల్లా : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కిసాన్‌మేళాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ స్టాళ్లను ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు పశు వైద్య విశ్వవిద్యాల యానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించారు. ఆగ్రో, బయోటెక్, ఫెర్టిలైజర్ కంపెనీలు తమ ఉత్ప త్తులు, యంత్రాలను ప్రదర్శించాయి. సంప్రదాయ చిరుధాన్యాలే కాకుండా వివిధ రకాల పండ్లు, వివిధ పంటల్లో వచ్చిన కొత్త వంగడాలు, యంత్ర పరికరాలతోపాటు కోళ్లు, కుందేళ్లు, పందులు, గొర్రెలు, పక్షుల పెంపకానికి సంబంధించిన స్టాళ్లు కూడా కొలువుదీరాయి. ‘ఈ కెనాన్’తో కోతులు పరార్ కోతులు, పందులు, ఇతర జంతు వుల నుంచి పంటలకు విముక్తి కల్పించేందుకు ‘సోలార్ ఆటోమేటిక్ ఈ కెనాన్’తోపాటు ఈ కెనాన్ (మంకీగన్)ను ప్రదర్శ నలో ఉంచా రు. సోలార్ ఆటోమేటిక్ ఈ కెనా న్ ధర రూ.26 వేలు. ఇది సోలార్ బ్యాట రీతో పనిచేస్తుంది. జంతువులు, పక్షులు పంటలపై దాడి చేయకుండా ఆటోమేటిక్‌గా సౌండ్స్ చేస్తాయి. ఈ సౌండ్స్ భయానికి అవి పారిపోతాయి. మంకీగన్ ధర రూ.3,500. క్యాల్షియం కార్బైడ్ దీనిలో నింపి, కొంచెం నీటిని వేయడం వల్ల గన్లోపల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ట్రిగ్గర్ నొక్కిన వెంటనే బాంబు పేలి న శబ్దం బయటకు వస్తుంది. ఈభారీ శబ్దానికి కోతులు, పందులు పారిపోతాయి. మంకీగన్ కొంటా.. మాకు 15 ఎకరాల భూమి ఉంది. పత్తి, మొక్క జొన్న వరిసాగు చేశాం. కోతుల బెడద ఎక్కువగా ఉంది. పండ్లు, కూరగాయలు ఏ పంట వేసినా చేతికి రావడం లేదు. కిసాన్‌మేళాలో మంకీగన్ చూశాను. ఖర్చు కూడా చాలా తక్కువే అనిపించింది. దీనిని కొనుగోలు చేసి కోతల బెడద నుంచి పంటను కాపాడుకుంటాను. – కల్యాణి, మహిళా రైతు, ఖమ్మం ఆహార వ్యర్థాల నుంచి వంటగ్యాస్ ఇంట్లో సహా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర వ్యర్థాలను వృథాగా పడేస్తుంటారు. ఇవి ఒకటి రెండు రోజుల్లోనే కుళ్లి, దుర్వాసన వెదజల్లుతాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయి. ఈ ఆహార వ్యర్థాల నుంచి ‘నానో బయోగ్యాస్ ప్లాంట్’ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం కేరళలో విరివిగా వాడుతున్న ఈ నానో బయోగ్యాస్ ప్లాంట్‌ను కిసాన్ మేళాలో ప్రదర్శించారు.దీనికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఖర్చుకూడా తక్కువే. దీని ధర రూ.28 వేలు. ఐదు లీటర్ల సామర్థ్యంతో ఏకధాటిగా రెండు గంటల పాటు వంట చేసుకోవచ్చు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలో తెలిసింది కొత్త టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలో అర్థమైంది. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ పంట దిగుబడి ఎలా సాధించాలో తెలిసింది. వచ్చే సీజన్ నుంచి పూర్తిగా ఈ యాంత్రీకరణపైనే ఆధారపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా. రైతులకు తోడుగా ఎన్ని రకాల యంత్ర పరికరాలు వచ్చాయో తెలిసింది. – ఎట్టయ్య, మనగల్ రైతు ‘ఫార్మ్రోబో ఆర్–1’తో గొర్రు, గుంటుక పొలంలో గొర్రుకు ఎద్దులను వాడుతుంటారు. రైతు కూడా రోజంతా పని చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఫార్మ్ రోబో ఆర్–1’ అందు బాటులోకి వచ్చింది. ఇది మనిషితో పనిలేకుండా పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తుంది. కేవలం విద్యుత్ చార్జింగ్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. గుంటక, గొర్రు, రోటావేటర్గా పనిచేస్తుంది. ఎరువులను కూడా వెదజల్లుతుంది. చేలో ఏపుగా పెరిగిన కలుపు మొక్కలను కూడా తొలగిస్తుంది. రూ.4.25 లక్షలు దీని ధర. డ్రైవర్‌తో పనిలేదు. బ్యాటరీలను ఒకసారి చార్జింగ్ చేస్తే 3 – 4 గంటల పాటు పని చేస్తుంది. గంట వ్యవధిలోనే ఎకరం భూమిలో గుంటుక కొడుతుంది. పటాన్‌చెరుకు చెందిన సంస్థ దీన్ని ప్రదర్శనలో ఉంచింది. స్మార్ట్ వ్యవసాయానికి ‘స్మార్ట్ డ్రోన్లు’ చీడపీడల నివారణకు రైతులు చేతి పంపులు, పెట్రోల్ పంపులను వాడుతారు. ఇది అనేక వ్యయ ప్రయాసలతో కూడినది. రైతు శ్రమ, ఖర్చు తగ్గించేందుకు పవ్మెన్ ఏవియేషన్ కంపెనీ సహా మారుతి డ్రోన్స్ ఏజీ 335హెచ్, వ్యవసాయ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇవి 120 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. క్రిమిసంహారక మందులను నేరుగా పంటపై వెదజల్లుతాయి. వీటి ధర రూ.4.15 లక్షలు. బ్యాటరీ బ్యాకప్‌తో పనిచేస్తుంది. పైలెట్‌కు సదరు సంస్థే శిక్షణ సహా లైసెన్స్‌ను కూడా ఇప్పిస్తుంది. పది లీటర్ల ట్యాంకు సహా రోజుకు కనీసం 25 నుంచి 30 ఎకరాలు పిచికారీ సామర్థ్యం ఉంది. -
డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
కవాడిగూడ : నగరంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శనను డిసెంబరు 19 నుంచి 29 వరకూ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కార్యదర్శి ఆర్ వాసు వెల్లడించారు. ఈ సందర్భంగా సాక్షితో పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బుక్‌ఫేయిర్ ప్రారం¿ోత్సవానికి ఎవరు వస్తున్నారు..? అని ప్రశ్నించగా.. 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు హాజరవుతారని, పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తారని వాసు తెలిపారు. మొత్తం ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు..? అనేదానికి ఈ పుస్తక ప్రదర్శనలో మొత్తం 347 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో తెలుగు 171, ఇంగ్లి‹Ù, ఇతర భాషలు 135, స్టేషనరీ 10, ప్రభుత్వ స్టాల్స్ 14 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓపెనింగ్స్‌కి రెండు వేదికలు.. అయితే గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, బుక్‌రిలీజ్ ఫంక్షన్లకు ఒకే వేధిక ఉండేదని, ఈ సంవత్సరం ఒకటి బోయి విజయభారతి పేరుతో, మరొకటి తోపుడు బండి సాదిక్ పేరుతో మొత్తం రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ సారి బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి దాశరథి శతజయంతి సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య పేరుతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా.. ప్రతిరోజూ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, రెండు వేదికలపైనా పలువురు కళాకారులు ప్రదర్శనలు ఇస్తారని వివరించారు. దీంతో పాటు స్టాల్స్ నిర్వాహకుల ఇబ్బంది లేకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని, ఇందు కోసం హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు 15 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పడిందని, మొత్తం 7 టీములుగా ఏర్పడి, గత రెండు నెలలుగా స్టాల్స్ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, ఏ విధంగా సహాయపడాలో ప్లాన్ వేసుకున్నామని తెలిపారు. మెరుగ్గా.. ఫుడ్ స్టాల్స్.. గతంలో కంటే ఈ సారి కాస్త మెరుగ్గా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన వంటకాలకు సంబందించిన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఇరానీ చాయ్, హైదరాబాద్ బిర్యానీ, కబాబ్స్, తెలంగాణ పిండివంటలు, చాట్ ఐటమ్స్ వంటివి ఈ సారి ఆహార ప్రియులకు రుచికరమైన విందును అందించనున్నాయి. పారిశుధ్యానికీ ప్రాధాన్యం..పుస్తక ప్రియులకు గతంలో నిర్వహించిన బుక్ ఫెయిర్‌లో టాయిలెట్లకు కొంతమేర ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమే. ఈ సారి వాటిని అధిగమించడానికి మొబైల్ టాయిలెట్స్‌తోపాటు ప్రత్యేక టాయిలెట్స్నూ ఏర్పాటు చేశాం. అయితే టైమింగ్స్ విషయంలోనూ కొద్దిగా మార్పులు చేశాం.. గతంలో మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఉండేది. ప్రస్తుతం సాహితీ అభిమానుల విజ్ఞప్తి మేరకు మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బుక్‌ఫెయిర్ అందుబాటులో ఉంటుంది. -
కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్!
కర్ణాటకలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్ పేర్కొన్నాడు. హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. హిజాబ్ తీర్పు ఎఫెక్ట్! హిజాబ్ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ మూసివేత
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్‌కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది. -
Sunday Funday: సండే-ఫండే’లో స్టాల్ పెడతారా?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్ తదితర స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in మరియు hcip hmda@gmail.com చిరునామాలకు మెయిల్ చేయాల్సిందిగా పేర్కొంది. లేదా హెచ్ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని సూచించింది. లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు సంగీతం తదితర కళారూపాలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్ఎండీఏ పేర్కొంది. -
వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు... ఈయన గారి నేర చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. వంగవీటి మోహన రంగా హత్య కేసులో నిందితుడుగా పరారై ఇక్కడకు వలస వచ్చిన దరిమిలా విశాఖ నగరంలో విష సంస్కృతికి బీజం వేసిన ప్రబుద్ధుడీయన. కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు.. అక్రమార్జన.. ఇలా విశాఖకు మునుపెన్నడూ ఎరగని నయా మాఫియాకు తెరలేపిన ’పచ్చ’ నేత ఈయన. దాదాపు పదిహేనేళ్లుగా తూర్పు నియోజకవర్గాన్ని చెరబట్టిన ఈయన గారి నిర్వాకాలకు, దందాలకు గత రెండేళ్లుగా బ్రేక్ పడుతూ వస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వెలగపూడి బ్యాచ్ భూదందాలు, కోడిపందాలు, మద్యం మాఫియాకు దాదాపు అడ్డుకట్టపడిందనే చెప్పాలి. అయితే అక్రమార్జన అలవాటుపడిన సదరు వెలగపూడి బ్యాచ్ చివరికి చిరు వ్యాపారుల ఫుడ్ కోర్ట్‌పై కూడా పడిపోయారు. నగరమంతటా కోవిడ్ వైరస్ కలకలం సృష్టిస్తుంటే.. నైట్‌ఫుడ్ కోర్టులో మాత్రం వెలగపూడి వైరస్ ప్రబలింది. ఇంతకీ.. ఆ వైరస్ ఏంటి.. నైట్‌ఫుడ్ కోర్టులో అసలేం జరుగుతోందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి రండి. మహా నగర పరిధిలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్‌తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే.. అదే ఏడాది మార్చి నుంచి కరోనా కలకలం మొదలవ్వడంతో లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24‘‘7 బిజీగా అయిపోయారు. గతేడాది మే నుంచి నుంచి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి చెందకుండా నగర ప్రజల్ని కాపాడే బాధ్యతని జీవీఎంసీ భుజానికెత్తుకొని.. నైట్ ఫుడ్ కోర్టు విషయాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని వ్యాపారాల మాదిరిగానే ఫుడ్ కోర్టు కూడా మొదలైంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఫుడ్‌కోర్టుని ఆక్రమించేశారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చజెండా పాతేశారు. అనుమతి 27 స్టాల్స్‌కి.. ఉన్నవి 138 అప్పటివరకు ఎంవీపీ కాలనీ, బీచ్‌రోడ్డులో స్ట్రీట్‌ఫుడ్ దందా సాగిస్తున్న వెలగపూడి బ్యాచ్ జైల్‌రోడ్డులోని నైట్‌ఫుడ్ కోర్టుని ఆక్రమించేసింది. వెలగపూడి తన అనుచరుల ద్వారా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయించేశారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్ర, ఒడిశా, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు ఇలా.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారికీ స్టాల్స్ పెట్టుకోడానికి వాళ్లే సొంత అనుమతులిచ్చేశారు. వీరిని చూసి.. మిగిలిన మరికొందరు సైతం తమకు నచ్చినట్లుగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకురాకుండానే ఓ రకంగా. మొత్తం ఫుడ్ కోర్టుని తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. మొత్తం 27 స్టాల్స్‌కు మాత్రమే అనుమతులుండగా ప్రస్తుతం 138 వరకూ వచ్చేశాయి. ఇందులో సగానికి పైగా వెలగపూడి అనుచరులకు చెందిన ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని అంటున్నారు. ఒక్కొక్కరూ తమ బంధువుల పేరుతోనే నాలుగైదు స్టాల్స్ ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారుల్ని మాత్రం వాటి దరి చేరకుండా తమ గుప్పిట్లోకి తీసేసుకున్నారు. జీవీఎంసీలో పెండింగ్‌లో 500 దరఖాస్తులు ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కి పైగా దరఖాస్తులు వచ్చాయని యూసీడీ విభాగాధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న 27 మందికి మాత్రమే ఇప్పటివరకు ఫుడ్ కోర్టులో స్టాల్స్ పెట్టుకోవాలని తాత్కాలిక అనుమతి ఇచ్చామనీ.. ఇంకెవ్వరినీ అనుమతించలేదని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాతే ఫుడ్ కోర్టు విషయమై ఏం చేయాలో ఆలోచిస్తామని అధికారులు అంటున్నారు. స్టాల్ స్టాల్‌కీ.. వసూళ్ల పర్వం జీవీఎంసీ తమ ఆదాయ వనరుగా నైట్ ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేస్తే.. వెలగపూడి బ్యాచ్ దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయిల వరకూ వసూలు చేశారు. పోనీ.. జీవీఎంసీకి వీటి వల్ల ఆదాయం వస్తుందా అంటే.. ఇప్పటివరకూ నైట్ ఫుడ్ కోర్టు నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని అధికారులే చెబుతున్నారు. మొదట అధికారికంగా ఏర్పాటు చేసిన 27 స్టాల్స్ నుంచి కూడా ఫీజు వసూలు చేయలేదనీ.. కరోనా కారణంగా మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చిరు వ్యాపారులను తొక్కేసి.. రోడ్లపై చిరుతిళ్లు అమ్ముతూ బతుకులీడ్చుతున్న నగరానికి చెందిన చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ చివరికి బడా వ్యాపారస్తుల కేంద్రంగా మారిపోయింది. ఆ ఫుడ్‌కోర్టులోకి అడుగు పెడితే కొన్ని స్టాళ్లలో పెద్ద హోటల్స్‌తో పోటీగా ధరలుంటాయి. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశ్యాన్ని పక్కదారి పట్టించి... చిరు వ్యాపారులను మింగేసిన పచ్చ రాబందులపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా దృష్టిసారిస్తారో లేదో చూడాలి. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
కాకుటూరు చేరుకున్న వైఎస్ జగన్
-
మన కూరగాయలను సద్వినియోగం చేసుకోండి
మణికొండ: మన తెలంగాణ–మన కూరగాయల పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవా లని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆదివారం పథకం ప్రారంభోత్సవానికి ఆయన మణికొండకు వచ్చారు. మర్రిచెట్టు సర్కిల్లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రభు త్వం ప్రతిష్టా త్మకంగా అమలుచేస్తోం దని తెలిపా రు. అనంతరం మణికొండలోని పంచవటి కాలనీ ప్రవేశంలో స్టాల్‌ను ఏర్పాటు చేయాలని కోరామని, అది అమలు కాలేదని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హరీష్‌రావు మార్కెటింగ్ శాఖ అధికారులపై మండిపడ్డారు. మణికొండలో రెండు స్టాళ్లను ఏర్పాటు చేయాలని గతంలో తాను ఆదేశించినా ఒకటే ఎందుకు సిద్ధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటివరకు ప్రక్రియ పూర్తి చేయకపోవడం ఏంటని నిలదీశారు. సర్వేనెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలోని కొంత స్థలాన్ని తమకు కేటాయిస్తామని తహసీల్దార్ చెప్పి.. ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతోనే స్టాల్ ఏర్పాటు చేయలేకపోయామని మార్కెట్ అధికారులు మంత్రికి వివరించారు. దీంతో హరీష్‌రావు.. సదరు విషయాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు సూచించారు. పక్కనే ఉన్న ఎంపీపీ తలారి మల్లేశ్ కలగజేసుకుని తహసీల్దార్‌తో మాట్లాడి ప్రతిపాదనలు పంపించామని, కలెక్టర్ స్థలం కేటాయించాలని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే స్టాల్ ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మన కూరగాల పథకంలో అటు రైతులతో పాటు ఇటు కొనుగోలుదారులకు న్యాయం జరుగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎంపీపీ తలారి మల్లేశ్, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్‌గౌడ్, మార్కెట్ ప్రత్యేక కార్యదర్శి పద్మహర్ష, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మమతాశ్రీనివాస్, వైస్ చైర్మెన్ శ్రీరాములు తదితరులు ఉన్నారు. -
యాపిల్‌కు షాకిచ్చిన కేంద్రం?
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్న ఆపిల్ కు భారీ షాక్ తగిలింది. యాపిల్ స్టోర్లు, రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకం అనే రెండు ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన యాపిల్ కు కేంద్రప్రభుత్వం అడ్డుకట్టవేసింది. యాపిల్ స్టోర్లను నెలకొల్పేందుకు ఆపిల్ పెట్టుకున్న దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. ఆపిల్ అనుకున్న ప్లాన్ ఇండియాలో అమలు చేయడానికి నిబంధనలు అనుమతించవని ఖరాఖండిగా చెప్పేసిందని పేర్కొంది. యాపిల్ రీఫర్బిష్డ్ ఫోన్లను (వినియోగ ఫోన్లు) దిగుమతి చేసుకుని విక్రయాలకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రాండెడ్ రిటైల్ స్టోర్లు తెరుచుకోవడానికి స్థానికంగా ఉన్న నిబంధనల్లో సడలింపు ఉండదని తేల్చి చెప్పింది. 30శాతం లోకల్ సోర్సింగ్ ఉండాలన్న నిబంధననుంచి వెనక్కితగ్గేది లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ నిబంధననుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా యాపిల్ కోరిందని తెలిపారు. భారత్ లో ఉద్యోగల కల్పన కోసం ఉద్దేశించిన ఈ నిబంధన సడలింపు కుదరదని జైట్లీ తేల్చి పారేశారు. మరోవైపు యాపిల్ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్' వార్తా సంస్థ తెలియజేసింది. ఇలా కేంద్రం నుంచి అనుకోని షాక్ తగలడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టయింది. పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయితే ఆపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని కొంతమంది నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. అయితే యాపిల్ కు ఇటీవలే భారత్ లో రిటైల్ స్టోర్లు ఏర్పాటుచేసుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి అనుమతులు లభించాయి.ఎఫ్ డీఐ నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రీటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి కల్పించింది. కానీ మూడింట ఒక వంతు కాంపోనెంట్స్ భారత్ కు చెందినవే ఉండాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం చెప్పింది. స్థానిక ఉద్యోగవకాశాలను, పరిశ్రమను అభివృద్ధి చేయడమే ఈ నిబంధ ఉద్దేశమని స్పష్టం చేసింది. కాగా పడిపోతున్న యాపిల్ అమ్మకాలను పునరుద్ధరించుకునే చర్యలో భాగంగా సీఈవో టిమ్ కుక్ ఇటీవలే భారత్ లో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులను, టెక్ నిపుణులను కలిశారు. ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి, సిద్ధి వినాయక టెంపుల్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
180 స్టాళ్లతో.. ట్రెడా ప్రాపర్టీ షో షురూ!
హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 స్టాళ్ల ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) స్థిరాస్తి ప్రదర్శన ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైన ఈ ప్రదర్శనను మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ‘‘టీఎస్ ఐపాస్ తరహాలోనే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో దేశ, విదేశాలకు చెందిన స్థిరాస్తి సంస్థలకు నగరానికి క్యూ కడతాయని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ వచ్చాక 15 రోజుల్లో ఫార్మా, తయారీ వంటి సుమారు 250 పరిశ్రమలకు అనుమతులిచ్చామని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ బాట పట్టనున్నాయని చెప్పారు. దీంతో వచ్చే రెండేళ్లలో హైటెక్ సిటీ ప్రాంతంలో 10 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. చైనాలో నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తారని.. అందుకే అక్కడ వంద అంతస్తుల భవంతిని కేవలం 6 నెలల్లోనే నిర్మించడం సాధ్యమవుతుందన్నారు. అలాంటి నిర్మాణాలు, ఆధునికత భాగ్యనగర నిర్మాణ సంస్థలు చేపట్టాలని సూచించారు. అప్పుడే నగర నిర్మాణ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో పేరొస్తుందని తెలిపారు. ఇందులో నగరానికి చెందిన స్థిరాస్తి సంస్థలతో పాటుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్కిటెక్చర్లు వంటి వారెందరూ పాల్గొన్నారు. నేడు, రేపు కూడా అందుబాటులో ఉంటుంది. 9-10 శాతం ధరలు పెరుగుతాయ్ ప్రస్తుతం నగర స్థిరాస్తి సంస్థలు నాలా పన్ను, ఇంపాక్ట్ ఫీజు, సీనరేజ్ చార్జీలు, పరిపాలన పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. టీఎస్-ఐపాస్ తరహాలోనే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా నగర నిర్మాణ రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం వాస్తవమే. కానీ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు.. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు, ప్రోత్సాహకరమైన పాలసీలతో స్థిరాస్తి రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని నమ్మకం ఉంది. రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఫలితంగా వచ్చే ఏడాదిలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9-10 శాతం మేర పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొంత మంది బిల్డర్లు 5 శాతం వరకు స్థిరాస్తి ధరలను పెంచేశారు కూడా. - ట్రెడా అధ్యక్షుడు పి. దశరథ్‌రెడ్డి -
ఇండియాస్ బిగ్గెస్ట్ కిచెన్ షో