
సాక్షి, గుడివాడ : కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పనులను బుధవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతులిస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నాని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment