house for all
-
గుడివాడలో 'హౌస్ ఫర్ ఆల్' పథకం ప్రారంభం
సాక్షి, గుడివాడ : కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పనులను బుధవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతులిస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నాని వెల్లడించారు. -
జాదూగర్ బాబు చేశారిలా..
చంద్రబాబు ప్రభుత్వం ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యత మరి దేనికీ ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన నిధులతో చేపట్టిన ‘అందరికీ ఇళ్లు’ పథకాన్ని కూడా దానికి వాడుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పనులు పూర్తికాకపోయినా అట్టహాసంగా ఆ ఇళ్లకు గృహప్రవేశాలు చేయించేశారు. కానీ ఇంతవరకూ వాటికి మౌలిక వసతుల కల్పన జరగలేదు. సాక్షి, మండపేట: ప్రచార ఆర్భాటానికి అధిక ప్రాధాన్యమిచ్చిన టీడీపీ సర్కారు పేదల సొంతింటి కలను తీర్చుతున్నట్టు గొప్పలు చెప్పుకుంది. పనులు పూర్తికాకుండానే ‘అందరికీ ఇళ్లు’ ప్లాట్లలోకి లబ్ధిదారులతో అట్టహాసంగా గృహప్రవేశాలు చేయించారు. త్వరలో సొంత ప్లాట్లలోకి వెళ్లిపోతామనుకున్న లబ్ధిదారుల ఆశలపై అసంపూర్తి పనులు నీళ్లు జల్లాయి. పూర్తిస్థాయిలో వసతుల కల్పన పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలలకు పైగా పట్టవచ్చని అంచనా. పట్టణ ప్రాంతాల్లో పేదవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం 2015–16లో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకంలో జిల్లాకు 24,332 ప్లాట్లు మంజూరు చేశారు. తొలి విడతగా తుని మినహా మిగిలిన నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 19,242 ప్లాట్ల నిర్మాణానికి రూ. 1,457.62 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ప్లాట్లు, రాజమహేంద్రవరానికి 4,200, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 4,064, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. రెండో విడతలో తునికి 5,049 ప్లాట్లు మంజూరు కాగా రాజమహేంద్రవరానికి 3,676, పెద్దాపురానికి 1,672, మండపేటకు 2,212 మంజూరయ్యాయి. 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో సింగిల్‌బెడ్ రూం, 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్ రూం, 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూం కేటగిరీల్లో నిర్మాణ పనులు చేపట్టారు. ప్లాట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. ప్లాట్లలో తాగునీటి అవసరాలకు, గృహావసరాలకు వేర్వేరుగా పైప్లైన్లు ఉండాల్సి ఉండగా అన్ని అవసరాలకు ఒకటే పైప్‌లైన్ పెట్టారని విమర్శిస్తున్నారు. అట్టహాసంగా గృహ ప్రవేశాలు అందరికి ఇళ్లు ప్లాట్లలో మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న గత టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తి కాకుండానే ఓటర్లకు గేలం వేసేందుకు ఫిబ్రవరి 9న అట్టహాసంగా గృహప్రవేశాలు చేయిం చేసింది. పలుచోట్ల రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ తదితర వసతుల కల్పన జరగలేదు. దాంతో గృహ ప్రవేశాలు చేసి నాలుగు నెలలవుతున్నా లబ్ధిదారులకు ప్లాట్లు దక్కలేదు. రాజమహేంద్రవరం కార్పొరేషన్, అమలాపురం, మండపేట, సామర్లకోట, పిఠాపురం తదితర మున్సిపాల్టీల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణ దశల్లో ఉండగా పైప్‌లైన్ పనులు చేయాల్సి ఉంది. అమలాపురంలో సబ్‌స్టేషన్ నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ వసతుల కల్పన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆయా పనులు పూర్తయ్యేందుకు మూడు నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
నా హయాంలో కమీషన్లకు చోటులేదు..
అహ్మదాబాద్ : దేశంలోని ప్రతి కుటుంబం 2020 నాటికి సొంత ఇల్లు సమకూర్చుకోవాలనేది తన కల అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలు అందుకోవడానికి ఎవరూ ముడుపులు ముట్టచెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు. అభివృద్ధి పథకాలకు ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే మొత్తం నూరు పైసలూ పేద కుటుంబానికి చేరతాయని అన్నారు. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో కేంద్రం విడుదల చేసే ప్రతి రూపాయిలో కేవలం 15పైసలే లబ్ధిదారుడుకి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని జుజ్వా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యాక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. గుజరాత్లో ఈ పథకం కింద లక్షకు పైగా ఇళ్లను నిర్మించారని ప్రధాని మోదీ తెలిపారు. -
హౌస్ ఫర్ సేల్
‘పురపాలికల్లో ఇళ్ల కోసం అధికారులను మాత్రమే సంప్రదించాలి. మధ్యవర్తులు, ఇతరులను సంప్రదించవద్దు’.. ఆదివారం విజయనగరంలో పురపాలక మంత్రి నారాయణ పేదలకిచ్చే ‘హౌస్ ఫర్ ఆల్’ పథకంపై స్వయంగా చెప్పిన మాటలు.. పై చిత్రం చూశారా.. బొబ్బిలి మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన కార్యాలయంలో కంప్యూటర్ల ముందు కూర్చున్నవారు అధికారులు కారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు. హౌస్ ఫర్ ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం.. అర్హులంటూ తమ వారిని ఎంపిక చేసుకోవడం వారి పని. మొత్తంగా ఇళ్ల ఎంపిక బాధ్యతను వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఇటీవల వారం రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయాల్లోనే తిష్ట వేసి లబ్ధిదారుల పేర్లు, కొత్త దరఖాస్తులు చేస్తున్నారు. కేవలం అధికారులే చేయాల్సిన పనిని వీరు అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లతో చేయించుకోవడం గమనార్హం. ఈ విషయం తెల్సినా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మరికొందరు అధికారులు సహకరిస్తున్నారు. బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తోంది. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా.. అన్నింటిలోనూ రాజకీ య వివక్ష చూపుతోంది. జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీ చోటా నాయకులతో అవినీతి చేస్తోంది. పథకానికి ఓ రేటు చొప్పున దందా చేస్తోందంటూ జనం మండిపడుతున్నారు. ప్రజా ధనంతో అమలుచేసే పథకాలు అర్హులకు అందడం లేదని వాపోతున్నారు. పట్టణాల్లో పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, తమ వారికే ఇళ్లు కేటాయించేలా జాబితాలు రూపొంది స్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదలు బతకడం కష్టం గా మారిందని, పనులు మానుకుని ఇంటిళ్లపాదీ నేతల సేవ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు అందేలా లేవంటూ మదనపడుతున్నారు. టీడీపీ పాలనా తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. దగ్గరుండి జాబితాల రూపకల్పన.. పట్టణ పేదల కోసం కేటాయించిన హౌస్ ఫర్ ఆల్ పథకం.. హౌస్ ఫర్ టీడీపీగా మారింది. ఓ పక్క అర్హులను కొర్రీలు వేసి తొలగిస్తూనే.. కొత్త దరఖాస్తులంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని తమ వారి జాబితాలు రూపొందిస్తున్నారు. అధికారుల్లా కార్యాయాల్లో ని కంప్యూటర్ల ముందు కూర్చొని జాబితాలు సిద్ధం చేస్తున్నా రు. అన్నింటా తామై ఉండి నడిపించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బొబ్బిలి మున్సిపాలిటీలో కంప్యూటర్ల ముందు కౌన్సిలర్ల పెత్తనమే కనిపిస్తున్నా కిమ్మనడంలేదు. ఎవరికి దరఖాస్తు చేయాలి? మరెవరిని అనర్హులు గా చూపించాలనే విషయంలో అధికారమంతా అధికార పార్టీ కౌన్సిలర్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఇక్కడి అధికార విభాగం లోపభూయిష్టంగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు కూడా తమ వర్గానికి చెందిన వారికే ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఉన్న నిరుపేదలు, ఎటువంటి ఆసరా లేని వారికోసం ఈ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేయాలని సంకల్పించారు. ఇప్పుడు కౌన్సిలర్లకు అధికారం ఇవ్వడంతో అర్హులను వివిధ కారణాలతో తొలగి స్తున్నారన్న వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎవరికోసం ఈ ఇళ్లు? జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు ము న్సిపాలిటీల్లో ఈ ఇళ్లను నిర్మించేందుకు స్థలాలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి ప్రాంతా ల్లో స్థలాలను కేటాయించారు. ఆయా మున్సిపాలిటీల్లో సొంత ఇల్లు లేనివారు, సొంత ఇంటి స్థలం లేనివారిని గుర్తించాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే నివసిస్తున్న వారు అర్హులు. అలాగే, సంవత్సరాదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదు. గతంలో ఎటువంటి గృహరుణం పొంది ఉండకూడదు. అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం యంత్రాలతో మట్టి నమూనాలు సేకరిస్తున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగా సిబ్బంది నియామకం.. వార్డుల్లో మున్సిపల్ సిబ్బందిని అర్హుల ఎంపికకు నియమిస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం నామమాత్రంగానే వీరిని నియమించారని, వార్డుల్లో ఇళ్ల గురించి చెప్పేది మాత్రం కౌన్సిలర్లేననీ, సంబంధిత అధికారులు ఎవరూ రావడం లేదని వార్డువాసులు చెబుతున్నారు. చాలా వార్డుల్లో నియమించిన మున్సిపల్ సిబ్బందిని వార్డుల్లోకి రావద్దని కౌన్సిలర్లు ముందే హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసి ఉన్న వారి సంఖ్య సుమారు 20 వేలకు పైగానే ఉంది. రుణాలిచ్చేదుందా? హౌస్ ఫరాల్ పథకంలో రుణాలు, డిపాజిట్లు ముఖ్యం. కేటగిరీల ప్రకారం ఒకటో కేటగిరీలో రూ.2.65లక్షలు, రెండో కేటగిరీకి రూ.3.15 లక్షలు, మూడో కేటగిరీకి రూ.3.65 లక్షల రుణం బ్యాంకులు ఇవ్వాలన్నది పథక నిర్ణయం. దీంతో ఈ రుణాలు నిజంగా బ్యాంకులు ఇస్తాయా అని జనం నోరెళ్లబెడుతున్నారు. దీంతో పాటు నిరుపేదలంతా మూడు కేటగిరీల్లోనూ రూ.500, 50,000, 100,000 వంతున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంది. ఈ డిపాజిట్ల చెల్లింపుతో పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. దీంతో ఈ గృహ నిర్మాణాలపై నమ్మకం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. రైల్వే శాఖ అనుమతిస్తేనే ఇళ్ల నిర్మాణం.. బొబ్బిలిలో నిరుపేదల కోసం అందరికీ ఇళ్లు పథకంలో ప్లాట్లు నిర్మించేందుకు గ్రోత్ సెంటర్ పక్కన 34 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి లేదు. రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నందున అధికారులు ఇప్పుడు డీఆర్ఎంకు లేఖ రాస్తున్నారు. ఇక్కడ గేటు వేయడం లేదా ఓవర్ బ్రిడ్జి నిర్మించడం అవసరం. గేట్లను ఇప్పటికే రైల్వే శాఖ తొలగిస్తున్నది. దీంతో ఓవర్‌బ్రిడ్జి తప్పనిసరి. ఇదంతా అయ్యే పనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు ఎదురుగా ఉన్న స్థలం చూపించిన అధికారులు దానిని ఎందుకు మార్చాతో తెలియడంలేదు. దారిలేని చోటును ఎందుకు కేటాయించారో వారికే తెలియాలి. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ స్థల సేకరణ జరిగాక నిర్మాణాలు ప్రారంభిస్తామని టెండర్ దక్కించుకున్న సంస్థ చెబుతుండగా.. ముందుగా అర్హులను తేల్చేందుకు కౌన్సిలర్లు ఉబలాట పడుతుండటం కొసమెరుపు. బొబ్బిలి పట్టణంలోని ఆరో వార్డులో గెంబలి కవిత అనే మహిళ ఉంది. అదే పేరుతో ఐదో వార్డులో మరో మహిళ ఉంది. ఇద్దరూ ఇల్లు కోసం దరఖాస్తు చేశారు. ఇందులో గెంబలి కవిత పేరున ఇల్లు మంజూరై ఉందని మరొకరి దరఖాస్తును తిరస్కరించారు. కాదు బాబోయ్ అంటున్నా అటు హౌసింగ్, ఇటు మున్సిపల్ కార్యాలయానికి తిప్పుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదు. వీరే కాదు పట్టణంలోని హౌస్ఫర్ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 30 శాతం ఇళ్లున్నాయని, ఇక్కడి వారు కాదని తిరస్కరిస్తున్నారు. మా పేరు గల్లంతైందని పట్టణ ప్రణాళికా విభాగం అధికారిని ప్రశ్నిస్తున్న కవిత ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఈశ్వరరావు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య సుమ, కుమార్తె హారికలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలోనే రూ.1500 నెలకు అద్దె చెల్లిస్తున్నాడు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇటువంటి వారికి ఇల్లు మంజూరు చేస్తారనే సరికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇతనికి ఆధార్ లింక్ కావడం లేదని జాబితా లోంచి పేరు తొలగించారని ఆవేదన చెందుతున్నాడు. -
అడుగుపెట్టి చూడ... అధ్వానమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఇల్లు కట్టి చూడు...పెళ్లి చేసి చూడు...అన్నారు పెద్దలు. సొంతింటి కలను సాకారం చేసుకోవడం ఎంత కష్టమో ప్రతి ఒక్కరికీ తెలుసు. అంత స్తోమత లేకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ‘హౌస్ çఫర్ ఆల్ పథకా’న్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘అందరికీ ఇళ్లు’ ఉండాలన్న లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమిటో నేటికీ స్పష్టత లేకపోయినా దాని నిర్మాణం పేరిట పూర్తి అజమాయిషీ చెలాయిస్తోంది. పోనీ అలా అయినా లబ్ధిదారులకు మేలు చేస్తుందా అంటే అదీ లేదు. నిర్మాణ బాధ్యతలను భుజానకెత్తుకుని ఇరుకు గదులు...ఆపై ‘సన్‌షేడ్ లేని ఇళ్లు, కప్ బోర్డుల్లేని గదులను నిర్మిస్తోంది. ఇవి చాలదన్నట్టు వాస్తు చూడకుండా నిర్మాణం చేపట్టేస్తున్నారు. ఇప్పుడీ నిర్మాణాలపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వస్తువులు భద్రపరుచుకోవడానికి వీల్లేని ఇళ్లు తమకెందుకని నిలదీస్తున్నారు. శనివారం ఆ ఇళ్ల పరిశీలనకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణకు ఆ అసంతృప్తి సెగ తాకింది. కట్టిన ఇళ్లు నాలుగు కాలాలపాటు ఉండాలని భావిస్తారు. మళ్లీ మళ్లీ మదుపు పెట్టే పరిస్థితి ఉండకూడదని ఆలోచిస్తారు. అందుకే ఇళ్ల నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తు దగ్గరి నుంచి అన్ని సౌకర్యాలున్నాయా లేవా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండన్నట్టుగా ఏదోరకంగా కట్టించి ఇచ్చేస్తాం....వాటిలోనే ఉండండన్నట్టుగా వ్యవహరిస్తోంది. వాస్తవంగా కొత్తగా నిర్మించినప్పుడే అన్నీ చూసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇలాగే కడతాం...ఏదైనా మార్పులు చేసుకోవల్సి వస్తే తర్వాత చేసుకోండన్నట్టుగా ‘హౌస్ ఫర్ ఆల్’ పథకం కింద పెద్దాపురంలో నిర్మిస్తున్న ఇళ్ల విషయంలో ముందుకెళ్తోంది. ఇప్పుడా ఇళ్లు మేడిపండు చందంగా తయారయ్యాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దాపురం పట్టణంలో తొలి విడతగా సుమారు 1734 ఇళ్ల నిర్మాణాలను ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద గృహ నిర్మాణం చేపట్టారు. రెండో దఫాగా సుమారు 1676 ఇళ్లు మంజూరు కాగా వాటిని కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానిక వాలుతిమ్మాపురం రోడ్డులో నిర్మించే ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఏపీ టిడ్కోకు అప్పగించగా ఓ బడా కంపెనీతో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇళ్ల నిర్మాణాలను మూడు విభాగాలుగా నిర్మిస్తున్న పాలకులు, అధికారులకు కూడా ఏ ప్లాన్ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారో తెలియని ఆయోమయ స్థితిలో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. వరండా, గదులు కూడా ఇరుకుగా నిర్మించడమే కాకుండా ఇంటి నిర్మాణానికి ఒక్క ఇటుక వాడకుండానే అధునాతన టెక్నాలజీ పేరుతో స్లాబ్ పద్ధతిలో గోడ నిర్మాణాలు చేపడుతోంది. ఇదిలా ఉంటే గదుల్లో ఎక్కడా సన్షేడ్లుగాని, కప్ బోర్డులు గానీ లేవు. వీటి నిర్మాణం జోలికి వెళ్లలేదు. అవి లేకపోవడంతో లబ్ధిదారులు తమ వస్తువులు భద్రపరుచుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ దిశగా ఆలోచించ లేదు. ఇక కేటగిరీ 2 కింద చేపడుతున్న నిర్మాణాల్లో ఈశాన్యంలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇది వాస్తుకు విరుద్ధమని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా అన్ని రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలే అప్పు...ఆపై లోపాలా ? ప్రభుత్వం నిర్దేశించిన మూడు కేటగిరీల్లోనూ లబ్ధిదారుడికి రూ.3 లక్షలకుపైగా రుణభారం పడుతుంది. దీన్ని చెల్లించుకోవడమే పేద, మధ్య తరగతి వారికి తలకు మించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో సన్ షేడ్ల్లేని ఇళ్లు, కప్‌బోర్డులు లేని గదులు నిర్మిస్తే వాటి కోసం మళ్లీ మదుపు పెట్టాల్సి ఉంటోంది. అలాగే వాటి కోసం కొత్త గోడలపైన పునర్నిర్మాణం చేయవల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి లబ్ధిదారులు నిలదీస్తుంటే ఏర్పాటు చేస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంత్రి నారాయణకు నిరసన సెగ ఇరుకు గదులు, సన్షేడ్లు, కప్ బోర్డుల్లేవన్న విషయాన్ని గుర్తించిన లబ్ధిదారులు శనివారం ఆ ప్రాంతానికి వచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణను నిలదీశారు. మహిళలంతా మంత్రిని చుట్టుముట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక సన్షేడ్లు, కప్ బోర్డులు ఏర్పాటు చేస్తామని సర్దిచెప్పే ప్రయత్నం మంత్రి చేశారు. పూర్తి స్థాయి వసతులు లేవు అన్ని వసతులతో ఇళ్లు నిర్మిస్తామన్నారు. కనీస వసతులు లేకుండా ఇరుకు గదులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. సన్‌సైన్, కప్ బోర్డులు లేకుంటే సామాన్లు పెట్టుకోవడానికి లేకుండాపోతుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. – సుందరపల్లి సుజాత, లబ్ధిదారులు, పెద్దాపురం. రుణభారం తప్పదు... నాణ్యత కనబడడం లేదు ‘అందరికీ ఇళ్లు’ పేరిట ఇళ్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం లబ్ధిదారులకు రుణభారం తప్పడం లేదు. ఏళ్ల తరబడిగా ఇచ్చిన రుణాన్ని చెల్లించేందుకు సిద్ధపడ్డా కనీస ఇటుక లేని ఇళ్లు నిర్మిస్తున్నారు. ఎంతవరకు నాణ్యతగా నిలబడతాయో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆధునిక ఇళ్ల పేరిట విశాలమైన గదులు లేకుండా ఇరుకుగా నిర్మిస్తున్నారు. ప్రశ్నిస్తే చూడడానికి బాగున్నాయా..? లేదా...? అంటున్నారే తప్ప వసతులు కల్పిస్తున్న దాఖలాలైతే కనబడడం లేదు. – కంపర పార్వతి, స్థానికులు, లబ్ధిదారు, పెద్దాపురం -
గూడు..గోడు
– పేదలకు సొంతిళ్లు కలే! – జిల్లా వ్యాప్తంగా ఒక్క ఇల్లూ పూర్తవని వైనం – ఎన్టీఆర్ రూరల్, అర్బన్ హౌసింగ్ పరిస్థితి ఇదీ – సమీక్షలతోనే సరిపెడుతున్న యంత్రాంగం – లబ్ధిదారుల ఎంపికలోనూ రాజకీయం సొంతిల్లు.. పేదోడి కల. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా అది ‘కల’గానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. నాలుగు గోడల మధ్య సమీక్షలతోనే సరిపెడుతున్న జిల్లా యంత్రాంగం.. క్షేత్రస్థాయిలో పునాదులు వేయించలేకపోతోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొత్తం ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కొనసాగడంతో ఇళ్లకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. అనంతపురం టౌన్ : జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసింది. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద మంజూరైన ఇళ్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి. అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు రెండు వేల చొప్పున, ధర్మవరానికి 1,400, రాయదుర్గానికి 1,307, హిందూపురానికి 500, కదిరికి వెయ్యి ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా టీడీపీ ప్రజాప్రతినిధులే చేయడంతో చాలా ప్రాంతాల్లో అర్హులకు అన్యాయం జరిగింది. ఈ పథకం కింద మొత్తం 8,207 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. కలెక్టర్ కోన శశిధర్ 7,346 ఇళ్లకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపారు. ఇందులో 7,051 ఇళ్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. 295 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటిలోనూ 258 ఇంకా బేస్మెంట్ స్థాయికి కూడా చేరుకోలేదు. 37 ఇళ్లు (కదిరిలో 36, రాయదుర్గంలో ఒకటి) మాత్రమే బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మొదలుకాకపోవడం గమనార్హం. రీ సర్వేకు కలెక్టర్ ఆదేశం కొన్ని నియోజకవర్గాల్లో ‘ఎన్టీఆర్ అర్బన్’ ఇళ్లకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. దీని కారణంగానే అనంతపురంలో 557, గుంతకల్లు 103, హిందూపురంలో 200 ఇళ్లకు కలెక్టర్ కోన శశిధర్ పరిపాలనా అనుమతి ఇవ్వలేదు. అనంతపురం, హిందూపురం నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉన్నారని ఫిర్యాదులు అందడంతో రీ సర్వేకు ఆదేశించారు. ఈ సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు మరోసారి ఫైల్ వెళితే మిగిలిన ఇళ్లకు అనుమతి లభించే అవకాశముంది. రూరల్దీ అదే పరిస్థితి జిల్లాకు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 17,400 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 13,840 ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే అనుమతి లభించింది. 11,695 ఇళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. తాడిపత్రి మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్లకు జియోట్యాగింగ్ తప్పనిసరి. హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) లాగిన్‌కు వెళ్లాలి. ఇప్పటి వరకు 12,483 ఇళ్లు లాగిన్ అవగా.. ట్యాగింగ్ చేసింది మాత్రం 5,749 ఇళ్లకే. అనుమతి లభించిన వాటిలో బేస్మెంట్ స్థాయికి చేరినవి 671 ఇళ్లే కావడం గమనార్హం. సమీక్షలతో సరి ఇళ్ల నిర్మాణాల విషయంలో గృహ నిర్మాణ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారులు సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్లతోనే సరిపెడుతున్నారు. ఎప్పుడు సమావేశం జరిగినా ఫలానా తేదీలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి.. అని చెప్పడం మినహా చేతల్లో మాత్రం పురోగతి లేదు. 6,285 ఇళ్లకే ‘ఉపాధి’ అంచనాలు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నిధులతో అనుసంధానం చేశారు. ఈ పథకం కింద విడుదలయ్యే నిధుల్లో 90 రోజుల పనికి గాను రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి రూ.17,460, ఇటుకల తయారీకి రూ.25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 ఖర్చు చేసుకోవాల్సి ఉంది. జిల్లా మొత్తం రూరల్ హౌసింగ్ పథకం కింద కలెక్టర్ అనుమతి ఇచ్చిన 13,840 ఇళ్లలో ఇప్పటి వరకు 6,285 ఇళ్లకు మాత్రమే అంచనాలు ఇచ్చారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ నియోజకవర్గం మంజూరు కలెక్టర్ ఆమోదం బేస్‌మెంట్‌లోపు.. బేస్మెంట్ స్థాయిలో.. ప్రారంభం కానివి అనంతపురం 2000 1443 9 0 1434 గుంతకల్లు 2000 1897 41 0 1856 ధర్మవరం 1400 1400 56 0 1344 రాయదుర్గం 1307 1307 104 1 1202 హిందూపురం 500 300 0 0 300 కదిరి 1000 999 48 36 915 ఎన్టీఆర్ రూరల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ నియోజకవర్గం కేటాయించిన ఇళ్లు మంజూరు జియోట్యాగింగ్ అయినవి బేస్‌మెంట్‌లోపు.. బేస్మెంట్ స్థాయిలో.. గుంతకల్లు 1250 1145 586 74 16 శింగనమల 1250 968 280 15 6 తాడిపత్రి 1250 1250 771 254 119 ఉరవకొండ 1250 1155 162 3 0 అనంతపురం 500 391 191 43 27 ధర్మవరం 1250 1032 277 68 44 కళ్యాణదుర్గం 1250 1097 428 134 47 రాప్తాడు 1250 1174 621 178 118 రాయదుర్గం 1250 1207 461 105 110 హిందూపురం 1500 423 186 40 39 కదిరి 1250 350 236 15 40 మడకశిర 1250 350 408 101 26 పెనుకొండ 1450 1259 448 69 47 పుట్టపర్తి 1450 1218 694 65 32 -
కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు
అధికారుల తీరుతో పేదల అవస్థ ఇంటి కోసం రెండుసార్లు దర ఖాస్తుల స్వీకరణ గతంలో దరఖాస్తు చేసుకున్నా మరోసారి పత్రాలు నెల్లూరు సిటీ: పేదలకు సొంతింటిని సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అందరికీ ఇళ్లు పథకం’ కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు కార్పొరేషన్ అధికారులు చుక్కలు చూపుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలం కలిగి ఉండి ఇళ్లులేని వారు 5240 మంది, ఇంటి కోసం 38 వేల మంది ఆన్లైన్, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆధార్, రేషన్‌కార్డు, ఫొటోలు, తదితర పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గత నెల 26 నుంచి కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, మీ సేవలో దరఖాస్తు చేసుకున్న కాపీతో పాటు ఆన్లైన్లో అప్పట్లో అప్లోడ్ చేసిన పత్రాన్ని మరోసారి తీసుకురావాలని కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. దీంతో రోజుకు వెయ్యి మందికి చొప్పున ఫోన్లు చేసి కార్యాలయానికి పిలిపించారు. వారి నుంచి గతంలో అప్లోడ్ చేసిన పత్రాలను మళ్లీ స్వీకరించారు. కూలీ పనులకు బ్రేక్.. కూలీ పనులు చేసుకుంటే తప్ప పూట గడవని పేదలు సొంతిల్లు వస్తుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. రోజూ పనులకు సైతం వెళ్లకుండా కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగారు. వందల సంఖ్యలో దరఖాస్తుదారులు కార్యాలయంలో క్యూ కట్టడంతో కూలీ పనులను మానుకొని రెండు రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అధికారుల తీరుతో పేదలు జిరాక్స్ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిరాక్స్‌ల కోసం రూ.10 నుంచి రూ.20 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయలోపంతోనే.. నగరపాలక సంస్థ అధికారుల సమన్వయలోపంతో పేదలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మరోసారి పత్రాలను స్వీకరించాల్సిందిగా ఇటీవల జరిగిన సమావేశంలో మేయర్ ఆదేశించారు. ఈ క్రమంలో మెప్మా సూపరింటెండెంట్ సులోచన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో ఈ రకంగా జరగడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కలిగిన వారే పత్రాలతో రండి: వెంకటేశ్వర్లు, కమిషనర్ నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలం కలిగి ఉండి ఇళ్లు లేని వారు మాత్రమే పట్టా రిజిస్ట్రేషన్ పత్రాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్లో అధికారులకు ఇవ్వాలి. ప్రభుత్వ స్థలం కలిగిన వారికి పొజిషన్ సర్టిఫికెట్‌ను అందజేస్తాం. ఇంటికి దరఖాస్తు చేసుకున్న వారు కార్పొరేషన్‌కు రావాల్సిన అవసరం లేదు. -
రాష్ట్రానికి 'డబుల్' నిరాశ!
'హౌజ్ ఫర్ ఆల్' కింద కేంద్రం నుంచి మంజూరైనవి 10,290 ఇళ్లే వాటి రూపంలో వచ్చే నిధులు రూ.154 కోట్లు ఎక్కువ ఇళ్లు వచ్చేలా లాబీయింగ్ చేయటంలో ప్రభుత్వం విఫలం సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం పొందాలని రాష్ట్రాలు ఆశించడం సహజం. కానీ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడింది. రాష్ట్రంపై కేంద్రం ఇప్పటికే శీతకన్ను వేసిన నేపథ్యంలో... ఢిల్లీపై ఒత్తిడి చేసి అందరికీ ఇళ్ల పథకం కింద ఎక్కువ ఇళ్లు మంజూరు చేసుకునేలా లాబీయింగ్ నెరపలేకపోయింది. దీంతో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీ సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు అత్తెసరుగా విదిల్చింది. దీంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ఖజానాపై భారం తగ్గే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయింది. 'హౌజ్ ఫర్ ఆల్' పథకం కింద కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌కు ఇళ్ల సంఖ్యను ఖరారు చేసింది. ఇందులో పది పట్టణాలకు సంబంధించి తెలంగాణకు కేవలం 10,290 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌కు 37 పట్టణాలకు సంబంధించి 1,93,147 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు కేటాయిస్తుంది. అంటే తెలంగాణకు మంజూరయ్యే మొత్తం కేవలం రూ.154 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,900 కోట్లు అందనున్నాయి. భారం భారీగా ఉన్నా: దేశంలో వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ ఇంటికి లబ్ధిదారు పేర బ్యాంకు రుణంగానీ, వారి వంతు వాటాగానీ లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించేలా విధివిధానాలు ఖరారు చేశారు. కేంద్రం ఇచ్చే ఇళ్లు ప్రస్తుతానికి పట్టణాలకే పరిమితమైనందున.. పట్టణ ప్రాంత ఇంటి నిర్మాణ వ్యయాన్ని పరిశీలిస్తే ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్‌గా నిర్ధారించారు. మౌలిక వసతుల కోసం మరో రూ.75 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. అంటే ఒక్కో ఇంటికి రూ.6.05 లక్షలు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఇస్తున్నందున... అక్కడ్నుంచి వీలైనన్ని ఇళ్లు ఎక్కువగా మంజూరు చేయించుకుని ఉంటే ప్రతి ఇంటిపై రూ.లక్షన్నర మేర భారం తగ్గేది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 60 వేల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లను నిర్మించాలని ఖరారు చేసింది. కేంద్రం 24 వేల ఇళ్లను మంజూరు చేసి ఉంటే ప్రతి ఇంటిపై రూ.లక్షన్నర చొప్పున రాష్ట్ర ఖజానాపై భారం తగ్గేది. ప్రణాళిక లోపం వల్లే: తమకు ఎన్ని ఇళ్లు కావాలో కోరుతూ కేంద్రానికి రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపుతాయి. రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల విషయంలో జాప్యం జరగటం, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం వస్తున్నా ప్రణాళిక సిద్ధం కాకపోవటంతో రాష్ట్రం కేంద్రానికి 10 వేల ఇళ్లకే ప్రతిపాదన పంపినట్టు తెలిసింది. ప్రతిపాదన పంపిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో 24 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మౌఖికంగా ఇళ్ల సంఖ్యను పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ప్రతిపాదనకు సవరణ చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరిన్ని ఇళ్లు మంజూరు చేసుకోవడంపైనా దృష్టి పెట్టలేదు. -
పట్టణ ఇళ్ల కోసం రూ.404 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రకటించిన 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-హౌస్ ఫర్ ఆల్' పథకం కింద తెలుగు రాష్ట్రాల్లో పట్టణ గృహనిర్మాణాల కోసం రూ.404.68 కోట్లు విడుదలయ్యాయి. ఏపీకి రూ. 225.62 కోట్లు తెలంగాణకు రూ.179.06 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడత ఎంపిక చేసిన పట్టణాల్లో నిధుల ద్వారా పేదల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆ పట్టణాలకే మళ్లీ అవకాశం: అందరికీ ఇళ్లు పథకం తొలి విడత కింద తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట పట్టణాలను కేంద్రానికి ప్రతిపాదించింది. గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన (ఆర్‌ఏవై) కింద ఈ పట్టణాలను ఎంపిక చేసి నిధులు సైతం కేటాయించింది. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆ ప్రాజెక్టులతో పాటే ఆర్‌ఏవైను రద్దు చేసింది. అయితే, ఆర్‌ఏవై కింద ఈ పట్టణాల్లో లబ్ధిదారుల ఎంపికపై సర్వేలు చేసి వుండటంతో, ఆ సమాచారాన్నే 'హౌస్ ఫర్ ఆల్'కి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన పట్టణాల్లో హౌస్ ఫర్ ఆల్ అమలుకు లబ్ధిదారులను గుర్తించడం కోసం సర్వే చేసేందుకు పురపాలకశాఖ ప్రణాళికలు రచిస్తోంది. నోడల్ ఏజెన్సీగా మెప్మా రాష్ట్రంలో హౌస్ ఫర్ ఆల్ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వ్యవహరించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.