అహ్మదాబాద్ : దేశంలోని ప్రతి కుటుంబం 2020 నాటికి సొంత ఇల్లు సమకూర్చుకోవాలనేది తన కల అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలు అందుకోవడానికి ఎవరూ ముడుపులు ముట్టచెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు.
అభివృద్ధి పథకాలకు ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే మొత్తం నూరు పైసలూ పేద కుటుంబానికి చేరతాయని అన్నారు. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో కేంద్రం విడుదల చేసే ప్రతి రూపాయిలో కేవలం 15పైసలే లబ్ధిదారుడుకి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని జుజ్వా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యాక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. గుజరాత్‌లో ఈ పథకం కింద లక్షకు పైగా ఇళ్లను నిర్మించారని ప్రధాని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment