-
∙గుండెపోటుతో వృద్ధురాలు విలవిల
-
∙ఆస్పత్రుల్లో ఎదురైన నిరాశ
పేదల ఆరోగ్యానికి భద్రత డొల్లగా మారింది. వైఎస్ జమానాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు విస్తృతంగా కార్పొరేట్ వైద్యం అందింది. నేటి పాలకులు ఎన్టీఆర్ భరోసాగా ఆ పథకం పేరు మార్చారు. పేరుతో పాటే దాని రూటూ మారింది. కార్పొరేట్ వైద్యం పేదలకు చుక్కలను చూపుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడం లేదు. దానికి ప్రత్యక్ష సాక్ష ్యమే ఈ వృద్ధురాలు.
చింతూరు :
ఆర్థిక పరిస్థితి సరిగా లేని ఓ వృద్ధురాలికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ప్రభుత్వాస్పత్రులకు వెళితే ఆమెకు వైద్యం అందలేదు. ఎన్టీఆర్ భరోసా లభిస్తుందేమో అని కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే ముందుగా వేలాది రూపాయలు డిపాజిట్‌గా కట్టమన్నారు. అంత స్థోమత లేక ఆమె కుమారులు నిరాశతో ఎటువంటి వైద్యమూ చేయించకుండానే ఆమెను ఇంటికి తీసుకుపోయారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది.
వివరాల్లోకి వెళితే..
చింతూరులోని ఎస్టీ కాలనీకి చెందిన తమ్మినేడి అమ్మాజీకి ఈనెల 16వ తేదీన గుండెపోటు వచ్చింది. దాంతో ఆమెను కుమారులు వెంకటరామయ్య, జగ¯ŒSమోహ¯ŒSరావు భద్రాచలం ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ డబ్బులు ఎక్కువవుతాయని చెప్పడంతో అదే రోజు చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రాజమహేంద్రవరం తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా కార్డులు ఉండడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అమ్మాజీని పరిశీలించిన వైద్యులు నాలుగు రోజులు అబ్జర్వేష¯ŒSలో ఉంచాలని. దానికి రూ. 33 వేలు ఖర్చవుతుందని, అనంతరం స్టెంట్ లేదా ఆపరేష¯ŒS చేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. తమవద్ద అంత సొమ్ము లేకపోవడంతో వారు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ 36 గంటలపాటు ఉంచినా తమ తల్లికి సరైన చికిత్స అందించలేదని, ప్రశ్నిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వెంకట్రామయ్య, జVýæన్‌మోహన్ రావు వాపోయారు. చివరకు తమ తల్లిని కాకినాడ లేదా గుంటూరు తీసుకు వెళ్లాలని ప్రభుత్వాస్పత్రి వైద్యులు సూచించారని వారు తెలిపారు. దానికి తాము సిద్ధమై అంబులెన్సు కోసం ఎదురు చూడగా 18 గంటలైనా రాకపోవడంతో చేసేదిలేక తమ తల్లికి ఎటువంటి వైద్యం చేయించకుండానే చింతూరు తీసుకొచ్చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా కార్డులు ఉన్నప్పటికీ తమ తల్లికి వైద్యం అందలేదని వారు వాపోయారు. ఆర్థికస్థోమత లేనందునే తమ తల్లికి వైద్యం అందించలేక పోతున్నామని, అధికారులు స్పందించి ఆమెకు వైద్యం అందించాలని వారు వేడుకుంటున్నారు.