no treatment
-
మరణశయ్యపై ఖలీదా జియా!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు సరైన వైద్య అందించకుండా ఆమెపై ప్రధాని షేక్ హసీనా పగ తీర్చుకుంటున్నారని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపించింది. ఖలీదా ‘మరణశయ్య’పై ఉన్నారని, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆ పార్టీ సెక్రటరీ జేనరల్ ఫక్రుల్ ఇస్లామ్ అలంగీర్ ఆదివారం తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న 78 ఏళ్ల ఖలీదా జియా శనివారం రాత్రి తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని, వెంటనే అంబులెన్స్‌లో ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. 1991 నుంచి 96 వరకు, 2001 నుంచి 2006 రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన ఖలీదా ఓ అవినీతి కేసులో జైలు పాలయ్యారు. అయితే జియా ఓల్డ్ ఢాకా సెంట్రల్ జైల్లోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే ఆమెకు సరైన వైద్యం అందలేదని అలంగీర్ ఆరోపించారు. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉండటానికి అనుమతించినప్పటికీ పూర్తి నిర్బంధంలో జైలులాంటి జీవితాన్నే అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఖలీదాకు విదేశాల్లో చికిత్స అవసరమని మెడికల్ బోర్డు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందకుండా చంపేసి, రాజకీయంగా అడ్డు తొలగంచుకోవాలని ప్రధాని షేక్ హసీనా చూస్తున్నారని అలంగీర్ ఆరోపించారు. -
కోవిడ్‌కు చికిత్స లేకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: కరోనా వైరస్ టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. అందుకే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని సూచించింది. ‘ప్రస్తుతానికైతే ఈ మహమ్మారిని రూపుమాపే సులువైన అద్భుత చికిత్సేదీ లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా..’అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ మీడియాతో అన్నారు. చైనాలో ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయమై విచారణ జరిపేందుకు డబ్ల్యూహెచ్‌వో పంపిన ఇద్దరు సభ్యుల బృందం తన ప్రాథమిక విచారణను ముగించిందని ఘెబ్రెసియస్ తెలిపారు. త్వరలోనే వైరస్ మూలాలను కనుగొనేందుకు డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి ప్రయత్నించనుందన్నారు. -
ఆధార్ పేరుతో.. అమర జవాను భార్యను చంపేశారు!
చంఢీఘడ్ : హరియాణలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆధార్ కార్డు లేదని చికిత్సకు నిరాకరించడంతో ఓ కార్గిల్ అమరజవాను భార్య మృతి చెందింది. హరియాణలోని సోనిపత్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతురాలి కుమారుడు పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆధార్ కార్డు అడిగారని, ఆసమయంలో తన దగ్గర లేకపోవడంతో మొబైల్లోని ఆధార్ కార్డు చూపించానని, చికిత్స చేయాలని, ఒక గంటలో తీసుకొస్తానని వేడుకున్నా కూడా వారు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై అమరజవాన్ల కుటుంబ సభ్యులు స్పందించారు. ఆధార్ లేక వైద్యం నిరాకరించడం మమ్మల్ని త్రీవంగా కలిచి వేసిందని, భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి వర్గాలు ఖండించాయి. ఆసుపత్రికి చెందని ఓ డాక్టర్ మాట్లాడుతూ.. ‘మేం ఎవ్వరి ట్రీట్మెంట్ను ఆపలేదు. ఈ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎవరిని ఆసుపత్రికి తీసుకురాలేదు. ఆధార్ లేదని ఇప్పటి వరకు ఎవరికి వైద్యం నిరాకిరించలేదు. డాక్యుమెంటేషన్ ప్రక్రియకు ఆధార్ తప్పనిసరే కానీ చికిత్సకు కాదు. ఇవిన్నీ నిరాధరమైన ఆరోపణలని’ తెలిపారు. -
పేదల వైద్యానికి భరోసా ఏదీ?
∙గుండెపోటుతో వృద్ధురాలు విలవిల ∙ఆస్పత్రుల్లో ఎదురైన నిరాశ పేదల ఆరోగ్యానికి భద్రత డొల్లగా మారింది. వైఎస్ జమానాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు విస్తృతంగా కార్పొరేట్ వైద్యం అందింది. నేటి పాలకులు ఎన్టీఆర్ భరోసాగా ఆ పథకం పేరు మార్చారు. పేరుతో పాటే దాని రూటూ మారింది. కార్పొరేట్ వైద్యం పేదలకు చుక్కలను చూపుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందడం లేదు. దానికి ప్రత్యక్ష సాక్ష ్యమే ఈ వృద్ధురాలు. చింతూరు : ఆర్థిక పరిస్థితి సరిగా లేని ఓ వృద్ధురాలికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ప్రభుత్వాస్పత్రులకు వెళితే ఆమెకు వైద్యం అందలేదు. ఎన్టీఆర్ భరోసా లభిస్తుందేమో అని కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే ముందుగా వేలాది రూపాయలు డిపాజిట్‌గా కట్టమన్నారు. అంత స్థోమత లేక ఆమె కుమారులు నిరాశతో ఎటువంటి వైద్యమూ చేయించకుండానే ఆమెను ఇంటికి తీసుకుపోయారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. చింతూరులోని ఎస్టీ కాలనీకి చెందిన తమ్మినేడి అమ్మాజీకి ఈనెల 16వ తేదీన గుండెపోటు వచ్చింది. దాంతో ఆమెను కుమారులు వెంకటరామయ్య, జగ¯ŒSమోహ¯ŒSరావు భద్రాచలం ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ డబ్బులు ఎక్కువవుతాయని చెప్పడంతో అదే రోజు చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రాజమహేంద్రవరం తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా కార్డులు ఉండడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అమ్మాజీని పరిశీలించిన వైద్యులు నాలుగు రోజులు అబ్జర్వేష¯ŒSలో ఉంచాలని. దానికి రూ. 33 వేలు ఖర్చవుతుందని, అనంతరం స్టెంట్ లేదా ఆపరేష¯ŒS చేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. తమవద్ద అంత సొమ్ము లేకపోవడంతో వారు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ 36 గంటలపాటు ఉంచినా తమ తల్లికి సరైన చికిత్స అందించలేదని, ప్రశ్నిస్తే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వెంకట్రామయ్య, జVýæన్మోహన్ రావు వాపోయారు. చివరకు తమ తల్లిని కాకినాడ లేదా గుంటూరు తీసుకు వెళ్లాలని ప్రభుత్వాస్పత్రి వైద్యులు సూచించారని వారు తెలిపారు. దానికి తాము సిద్ధమై అంబులెన్సు కోసం ఎదురు చూడగా 18 గంటలైనా రాకపోవడంతో చేసేదిలేక తమ తల్లికి ఎటువంటి వైద్యం చేయించకుండానే చింతూరు తీసుకొచ్చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా కార్డులు ఉన్నప్పటికీ తమ తల్లికి వైద్యం అందలేదని వారు వాపోయారు. ఆర్థికస్థోమత లేనందునే తమ తల్లికి వైద్యం అందించలేక పోతున్నామని, అధికారులు స్పందించి ఆమెకు వైద్యం అందించాలని వారు వేడుకుంటున్నారు. -
ఆస్పత్రిలో నివాసం.. వైద్యానికేదీ అవకాశం
ఎవరు చెప్పిన వినరట.. భవనాన్ని ఖాళీ చేయరట ప్రైవేట్ వ్యక్తుల ‘కబ్జా’లో.. చాకెపల్లి సబ్‌సెంటర్! బెల్లంపల్లి రూరల్ : ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు పక్కా భవనాలు లేక ఒకవైపు వైద్య సిబ్బందితో పాటు ప్రజలు అవస్థల పాలవుతుంటే ప్రభుత్వ పక్కా భవనం ఉండి కూడా అందులో ఆస్పత్రి నిర్వహణ చేయనీయకుండా ఒక కుటుంబం కొన్నేళ్లుగా కాపురం ఉంటోంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఇదీ పరిస్థితి బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చాకెపల్లి ఆరోగ్య ఉపకేంద్రానికి ప్రభుత్వం పక్కా భవనం నిర్మించింది. అయితే ఆ భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్య సేవలు అందులో జరగడం లేదు. అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఆ భవనంలో ఉంటోంది. చాకెపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో ఒక కుటుంబానికి చెందిన వారు సొంత ఇంటిలా వాడుకుంటున్నారనే విషయం అధికారులకు తెలిసినా వారెవరూ ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. దీంతో చాకెపల్లి గ్రామంలో వైద్యసేవలు అందడం లేదు. నిత్యం తెరుచుకోవాల్సిన చాకెపల్లి ఆరోగ్య ఉపకేంద్రం పండుగలకు, పర్వదినాలకు మాత్రమే తెరుచుకుంటుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ పని చేసే వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనేది ఈ గ్రామస్తుల ప్రధాన ఆరోపణ. లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మిస్తే ప్రైవేట్ వ్యక్తులు దానిలో ఉండటం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికి సంబంధిత వైద్య ఆరోగ్య ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం మాత్రం లేదు. ఈ ఉపకేంద్రంలో కాపురం ఉంటున్న కుటుంబాన్ని ఖాళీ చేయిస్తే తాము విధులకు హాజరుకావడం లేదనే విషయంపై ఒత్తిళ్లు వస్తాయనే కారణంగా స్థానిక వైద్య సిబ్బంది కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యం.. దైన్యం.. ప్రస్తుతం చాకెపల్లిలో ఆరోగ్య ఉపకేంద్రంలో వైద్యసేవలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయని, ఇక్కడ పని చేసే సిబ్బంది నామమాత్రంగా విధులకు వస్తూ పోతూ ఉంటారని, వారు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో ఎవరికీ తెలియదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీకాలు, ఇతర వైద్యసేవలను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే కొనసాగిస్తున్నారు. ఇక్కడ పని చేసే సిబ్బంది కేవలం టీకాలు వేసే రోజుల్లో మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా రోజుల్లో పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. దీంతో ఏ రోగమొచ్చినా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ వైద్యులైన ఆర్ఎంపీలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడం కారణంగా చాలా మంది రోగాల బారిన పడే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్య ఉపకేంద్రంలో నివాసముంటున్న వారితో ఖాళీ చేయించి నిర్వహణ సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలని చాకెపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులుంటున్నది వాస్తవమే తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చాకెపల్లి ఆరోగ్య ఉపకేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకొని ఉంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు వారిని అడిగినా ఖాళీ చేయడం లేదు. కొంతమంది గ్రామానికి చెందిన పెద్దలు వారికి మద్దతు తెలుపుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. వైద్యసేవలు అందడం లేదనే విషయంపై విచారణ జరుపుతాం. – రుతుక్లార, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్, బెల్లంపల్లి -
వైద్యం అందక గిరిజన విద్యార్థి మృతి
జీడిగుప్ప గిరిజన ఆశ్రమ పాఠశాలలో దుర్ఘటన హెచ్ఎం, వార్డెన్ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు l విచారణకు తల్లిదండ్రుల డిమాండ్ జీడిగుప్ప (వీఆర్‌పురం) : ప్రధానోపాధ్యాయుడు, వార్డెన్ నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి నిండు ప్రాణం బలైంది. జీడిగుప్ప(రాయిగూడెం) గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న అప్పల నాగరాజు (10) అనే గిరిజన విద్యార్థి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. వసతి గృహంలో ఉంటున్న నాగరాజు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, సరైన వైద్యం అందక మృతి చెందినట్టు సమాచారం. మృతుడి సోదరుడు పైడిరాజు కూడా ఇదే ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి. తన తమ్ముడికి నాలుగు రోజులుగా జ్వరం వస్తోందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో, తోటి విద్యార్థులే పక్కనే ఉన్న జీడిగుప్ప(రాయిగూడెం) పీహెచ్‌సీకి గురువారం తీసుకువెళ్లారని తెలిపాడు. ఈ విషయం తెలిసిన తల్లి సింగమ్మ అదే రోజు నాగరాజును స్వగ్రామమైన మొద్దులగూడెం తీసుకువచ్చి వైద్యం అందించింది. అయితే శుక్రవారం రాత్రి నాగరాజు పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు ముందుగా రేఖపల్లి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కూనవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూనవరం ఆస్పత్రి డాక్టర్ ఎ.అమరేందర్ ఆ బాలుడిని పరిశీలించి పరిస్థితి విషమంగా ఉన్నందున భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. అర్ధరాత్రి కావడంతో ఉదయం వెళతామని, ఈలోగా వైద్యం చేయాలని తల్లిదండ్రులు కోరారు. ఆ బాలుడికి వైద్యం అందిస్తుండగా కొద్ది సమయానికే మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యం అంది ఉంటే తమ కుమారుడు బతికి ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థి మృత దేహాన్ని తల్లిదండ్రులు స్వగ్రామం మొద్దులగూడెం తీసుకువెళ్లారు. కనీసం సమాచారం ఇవ్వలేదు అనారోగ్యంగా ఉన్న తమ బిడ్డను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందాడని అప్పల నాగరాజు తల్లిదండులు సీతయ్య, సింగమ్మ ఆరోపిస్తున్నారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యల తీసుకోవాలని కోరారు. విచారణ చేపడతాం జీడిగుప్ప ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి నాగరాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయమై ఏటీడబ్ల్యూఓ ఎస్.అబ్బులును ‘సాక్షి’ వివరణ కోరింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని బధులిచ్చారు. -
పడకేసిన అచ్చయ్యపాలెం!
సీజనల్ జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు పునరావాస గ్రామంపై అధికారుల నిర్లక్ష్యం అచ్చయ్యపాలెం (సీతానగరం) : ‘పోలవరం’ పునరావాస గ్రామమైన అచ్చయ్యపాలెం సీజనల్ వ్యాధులతో పడకేసింది. ఏ ఇంట్లో చూసినా మంచానపడ్డవారే కనిపిస్తున్నారు. సుమారు 300 మంది ఉన్న ఈ గ్రామంలో కనీసం వైద్య సౌకర్యాలు కూడా కొరవడ్డాయి. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మికి ఆ గ్రామ ప్రజలు తమ గోడు వెళ్లగక్కారు. జ్వరం వచ్చిందంటే, ఆస్పత్రికి Ðð ళ్లడానికి సీతానగరం 15 కి.మీ., కోరుకొండ 16 కి.మీ. దూరంలో ఉన్నాయి. వైద్యానికి దిక్కులేదు నాగంపల్లి పంచాయతీలోని అచ్చయ్యపాలెం గ్రామం దూరంగా విసిరివేసినట్టుగా ఉంటుంది. వైద్య సిబ్బంది, ఏఎన్ఎం గ్రామస్తులకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఏ చిన్నపాటి రోగానికి వైద్యం అందించే దిక్కులేదు. సుమారు 300 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 35 మందికి పైగా పిల్లలు, వృద్ధులు సహా జ్వరాలతో మంచాన పడ్డారు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. దాదాపు మూడు వారాలుగా వీరు మంచానపడి ఉన్నారు. కొంతమంది మోటార్ సైకిళ్లపై ఆస్పత్రులకు వెళుతున్నారు. ఆటోలు కానీ, బస్సులు, ప్రైవేట్ వాహనాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఒకే కుటుంబానికి చెందిన అనిమిల్లి మంగ, అనిమిల్లి దీలీప్, అనిమిల్లి నవీన్, అనిమిల్లి మదులు జ్వరాలతో బాధపడుతున్నారు. అలాగే సంసాని వెంకయ్యమ్మ, పంది సురేష్, పంది రాంబాబు, పంది సూరమ్మ, పంది సూర్యచంద్రం, పీతా మునేష్ తదితరులు 25 మందికి పైగా జ్వరాలతో మంచాన పడ్డారు. ఈ గ్రామంలో టీబీతో బాధపడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. వీరికీ మందులు ఇచ్చే వారే కరువయ్యారు. వైద్యశాఖ అధికారులు అచ్చయ్యపాలెంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అన్నీ ఉన్నా... సేవలు సున్నా!
ఎనిమిదంతస్తుల అద్దాల మేడ... అందులో వైద్యం మాత్రం కరువు... ఇదీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పరిస్థితి..మెడికల్ కళాశాల వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయని భావించిన ప్రజలకు చివరకు నిరాశే మిగులుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపు లేని వైఖరి పేద రోగుల పాలిట శాపంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నగరం నడి బొడ్డున నిర్మించిన నూతన ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవు. దయనీయంగా ఇందూరు సర్కారు ఆస్పత్రి నిజామాబాద్ అర్బన్: 2008లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. దీనికి అనుగుణంగా జిల్లా ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకున్నారు. 2013లో మెడికల్ కళాశాల మొదటి తరగతులు ప్రారంభమయ్యా యి. కళాశాల కోసం రూ. 160 కోట్లు మంజూరు చేశారు. 110 మంది ప్రొఫెసర్లను నియమించారు. ఇందులో 72 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. రిజిష్టర్‌లో సంతకాలు చేస్తూ దర్జాగా వేతనం పొందుతూ, వైద్యసేవలకు మాత్రం రావడం లేదు. ఈ విషయంలో డీఎంఈ కూడా పెదవివిప్పడం లేదు. కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ మెమోలు జారీ చేసినా ఫలితం లేదు. కేవలం 42 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరు కూడా హైదరాబాద్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం 102 మంది సీనియర్ రెసిడెన్షియల్ డాక్టర్లను ఈ ఆస్పత్రికి కేటాయించారు. వీరు మొదటి రెండు నెలలు కనిపించకుండా పో యారు. ఇందులో సగం మంది నగరంలోని ఓ ప్రరుువేటు ఆస్పత్రి లో పని చేస్తున్నారు. కళాశాలకు గైర్హాజరవుతున్నారు. దీంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు, ముఖ్యమైన వైద్యసేవలు అందడం లేదు. ప్రతి రోజు ఆస్పత్రికి 670 మంది వరకు అవుట్‌పేషెంట్లు, 210 మంది వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారు. ఖాళీల కొరత ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించేందుకు అనుగుణంగా సిబ్బంది లేరు. ప్రభుత్వం 2013లో 852 పోస్టులను భర్తీ కోసం 150 జీఓను విడుదల చేసింది. నేటి వరకు ఈ పోస్టులు భర్తీ కావడం లేదు. 210 మంది స్టాఫ్‌నర్సులు, 180 మంది 4వ తరగతి ఉద్యోగులు, 150 వైద్యులు అత్యవసరంగా కావాలి. కానీ, 66 మంది స్టాఫ్‌నర్సులు, 16 మంది 4వ తరగతి ఉద్యోగులు, 42 మంది వైద్యులే అందుబాటులో ఉన్నారు. బ్లడ్‌బ్యాంకు, సిటీస్కాన్, ఎక్స్‌రే ఇతర విభాగాలలో పనిచేసేందుకు సిబ్బంది అందుబాటులో లేరు. వేలాది మంది రోగులకు ఒకరిద్దరు మాత్రమే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. ప్రతి రోజు ఆస్పత్రికి 15 నుంచి 20 అత్యవసర కేసులు వస్తున్నాయి. వీటిలో ఒకటి, రెండు మినహా మిగితా అన్ని కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అత్యధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సిటీస్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, ల్యాబ్, చిన్నపిల్లలకు ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ, సిబ్బంది లేకపోవడంతో సేవలు సక్రమంగా అందడం లేదు. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం ఆస్పత్రిలో పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా లేదు. ఇటీవల ఓ ప్రరుువేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. మెట్లపైన, రోగుల గదులలో చెత్తాచెదారం పేరుకపోతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా మాత్రమే చెత్తను తొలగిస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టాయిలెట్ గదులు, డ్రైనేజీలు సక్రమంగా లేక మురికినీరు ఆస్పత్రి ఆవరణలోనే ఉంటుంది. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. నీటి సౌకర్యం లేదు. మోటారు ఉన్నప్పటికీ నల్లాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడంతోపైపులు దెబ్బతిన్నాయి. దీంతో మోటారును వాడడం లేదు. రిపేర్ చేయించడంతో తీవ్ర ఆలస్యం జరుగడంతో రోగులకు నీటి సౌకర్యం అందుబాటులో లేకుండాపోయింది. సక్రమంగాలేని పరిపాలన ఆస్పత్రి పరిపాలన లోపభూరుుష్టంగా ఉంది. మొన్నటి వరకు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న ఆస్పత్రి, గత నెల 26న మెడికల్ కళాశాల పరిధిలోకి వచ్చింది. గత రెండేళ్ల నుండి ఆస్పత్రికి సంబంధించి బాధ్యత గల ఉన్నతాధికారులు లేకపోవడంతో ఇష్టరాజ్యాంగా మారింది. కళాశాలకు అనుబంధంగా ఉన్న వైద్య విధాన ప రిషత్కు చెందిన సీనియర్ వైద్యులు , సూపరిడెంట్, ఆర్‌ఎంఓలుగా ఉన్నారు. దీంతో మెడికల్ కళాశాలకు కేటాయించబడిన ప్రొఫెసర్లు మాకంటే కిందిస్థాయి వైద్యాధి కారుల వద్ద తామెందుకు పనిచేయాలంటూ ఆస్పత్రికి మొఖం చాటేశారు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. దీంతో ఆస్పత్రి పూర్తిగా గాడితప్పింది. ప్రస్తుతం పరి పాలన ఇద్దరు జూనియర్ వైద్యులే కొనసాగించడంతో సీనియర్ వైద్యులు మొండికేస్తున్నారు. దీనిని నియంత్రించే ఉన్నతాధికారులు ఎవరు లేకపోవడం గమనార్హం.