ఎనిమిదంతస్తుల అద్దాల మేడ... అందులో వైద్యం మాత్రం కరువు... ఇదీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పరిస్థితి..మెడికల్ కళాశాల వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయని భావించిన ప్రజలకు చివరకు నిరాశే మిగులుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపు లేని వైఖరి పేద రోగుల పాలిట శాపంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నగరం నడి బొడ్డున నిర్మించిన నూతన ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవు.
దయనీయంగా ఇందూరు సర్కారు ఆస్పత్రి
నిజామాబాద్ అర్బన్: 2008లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. దీనికి అనుగుణంగా జిల్లా ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకున్నారు. 2013లో మెడికల్ కళాశాల మొదటి తరగతులు ప్రారంభమయ్యా యి. కళాశాల కోసం రూ. 160 కోట్లు మంజూరు చేశారు. 110 మంది ప్రొఫెసర్లను నియమించారు. ఇందులో 72 మంది ప్రొఫెసర్లు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
రిజిష్టర్లో సంతకాలు చేస్తూ దర్జాగా వేతనం పొందుతూ, వైద్యసేవలకు మాత్రం రావడం లేదు. ఈ విషయంలో డీఎంఈ కూడా పెదవివిప్పడం లేదు. కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ మెమోలు జారీ చేసినా ఫలితం లేదు. కేవలం 42 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరు కూడా హైదరాబాద్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం 102 మంది సీనియర్ రెసిడెన్షియల్ డాక్టర్లను ఈ ఆస్పత్రికి కేటాయించారు.
వీరు మొదటి రెండు నెలలు కనిపించకుండా పో యారు. ఇందులో సగం మంది నగరంలోని ఓ ప్రరుువేటు ఆస్పత్రి లో పని చేస్తున్నారు. కళాశాలకు గైర్హాజరవుతున్నారు. దీంతో రోగులకు అత్యవసర వైద్యసేవలు, ముఖ్యమైన వైద్యసేవలు అందడం లేదు. ప్రతి రోజు ఆస్పత్రికి 670 మంది వరకు అవుట్‌పేషెంట్లు, 210 మంది వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారు.
ఖాళీల కొరత
ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించేందుకు అనుగుణంగా సిబ్బంది లేరు. ప్రభుత్వం 2013లో 852 పోస్టులను భర్తీ కోసం 150 జీఓను విడుదల చేసింది. నేటి వరకు ఈ పోస్టులు భర్తీ కావడం లేదు. 210 మంది స్టాఫ్‌నర్సులు, 180 మంది 4వ తరగతి ఉద్యోగులు, 150 వైద్యులు అత్యవసరంగా కావాలి. కానీ, 66 మంది స్టాఫ్‌నర్సులు, 16 మంది 4వ తరగతి ఉద్యోగులు, 42 మంది వైద్యులే అందుబాటులో ఉన్నారు. బ్లడ్‌బ్యాంకు, సిటీస్కాన్, ఎక్స్‌రే ఇతర విభాగాలలో పనిచేసేందుకు సిబ్బంది అందుబాటులో లేరు.
వేలాది మంది రోగులకు ఒకరిద్దరు మాత్రమే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. ప్రతి రోజు ఆస్పత్రికి 15 నుంచి 20 అత్యవసర కేసులు వస్తున్నాయి. వీటిలో ఒకటి, రెండు మినహా మిగితా అన్ని కేసులను హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అత్యధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సిటీస్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, ల్యాబ్, చిన్నపిల్లలకు ప్రత్యేక విభాగం ఉన్నప్పటికీ, సిబ్బంది లేకపోవడంతో సేవలు సక్రమంగా అందడం లేదు.
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
ఆస్పత్రిలో పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా లేదు. ఇటీవల ఓ ప్రరుువేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. మెట్లపైన, రోగుల గదులలో చెత్తాచెదారం పేరుకపోతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా మాత్రమే చెత్తను తొలగిస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు.
ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టాయిలెట్ గదులు, డ్రైనేజీలు సక్రమంగా లేక మురికినీరు ఆస్పత్రి ఆవరణలోనే ఉంటుంది. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. నీటి సౌకర్యం లేదు. మోటారు ఉన్నప్పటికీ నల్లాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడంతోపైపులు దెబ్బతిన్నాయి. దీంతో మోటారును వాడడం లేదు. రిపేర్ చేయించడంతో తీవ్ర ఆలస్యం జరుగడంతో రోగులకు నీటి సౌకర్యం అందుబాటులో లేకుండాపోయింది.
సక్రమంగాలేని పరిపాలన
ఆస్పత్రి పరిపాలన లోపభూరుుష్టంగా ఉంది. మొన్నటి వరకు వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న ఆస్పత్రి, గత నెల 26న మెడికల్ కళాశాల పరిధిలోకి వచ్చింది. గత రెండేళ్ల నుండి ఆస్పత్రికి సంబంధించి బాధ్యత గల ఉన్నతాధికారులు లేకపోవడంతో ఇష్టరాజ్యాంగా మారింది. కళాశాలకు అనుబంధంగా ఉన్న వైద్య విధాన ప రిషత్‌కు చెందిన సీనియర్ వైద్యులు , సూపరిడెంట్, ఆర్‌ఎంఓలుగా ఉన్నారు.
దీంతో మెడికల్ కళాశాలకు కేటాయించబడిన ప్రొఫెసర్లు మాకంటే కిందిస్థాయి వైద్యాధి కారుల వద్ద తామెందుకు పనిచేయాలంటూ ఆస్పత్రికి మొఖం చాటేశారు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. దీంతో ఆస్పత్రి పూర్తిగా గాడితప్పింది. ప్రస్తుతం పరి పాలన ఇద్దరు జూనియర్ వైద్యులే కొనసాగించడంతో సీనియర్ వైద్యులు మొండికేస్తున్నారు. దీనిని నియంత్రించే ఉన్నతాధికారులు ఎవరు లేకపోవడం గమనార్హం.
అన్నీ ఉన్నా... సేవలు సున్నా!
Published Wed, Mar 11 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement