న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి విజృంభణ వలన దేశంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది సొంత రాష్ట్రాలకు తిరిగి వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం, పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం కింద పేదలకు తీపికబురు అందించింది.
ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క లభ్దిదారునికి మే, జూన్ నెలలో 5 కిలోల చొప్పున ఆహర ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో, దాదాపు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఆహర ధాన్యాల కోసం కేంద్రం తొలిదశలో రూ. 26 వేల కోట్లను ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment