పేదల నుంచి పార్టీ ఫండ్‌ | party fund from the poor | Sakshi
Sakshi News home page

పేదల నుంచి పార్టీ ఫండ్‌

Published Sun, Sep 17 2017 2:30 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

పేదల నుంచి పార్టీ ఫండ్‌ - Sakshi

పేదల నుంచి పార్టీ ఫండ్‌

నటుడు కమల్‌హాసన్‌ వ్యాఖ్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ స్థాపన కోసం పేదల నుంచి నిధులు సమీ కరిస్తానని నటుడు కమల్‌హాసన్‌ తెలిపారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన తాను త్వరలో పార్టీని ప్రకటిస్తానని అన్నారు. ప్రముఖ తమిళ దినపత్రిక ‘ది హిందూ’ చెన్నైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఒక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వక్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధా నాలిచ్చారు.

‘పేదల జీవన పరిస్థితులు మె రుగుపడటం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా. అది గాం«ధేయవాదమా, మార్క్సి జమా అనేది ముఖ్యం కాదు’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ నడిపేందుకు నిధులను ‘పేదల నుంచే’ సమకూర్చుకుంటాను’ అని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రజనీకాంత్‌ను కూడా కలుస్తానని, వస్తానంటే ఆయన్ని కూడా కలుపుకుపోతానని తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement