
చెన్నై: రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ విధించడంతో నిరుపేదలు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుల అభిమానులు నిరుపేదలు, అనాథలు, బిచ్ఛగాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్నారు. నటుడు అజిత్ అభిమానులు పుదుచ్చేరిలో వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్ల ప్యాకెట్‌లతో కూడిన బండ్లను రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నారు. ఆకలి వేసిన వారు వచ్చి ఆహారాన్ని తీసుకుని తినొచ్చు అనే పోస్టర్లను అంటించారు. అజిత్ అభిమానుల ఉదార స్వభావాన్ని, సేవా దృక్ఫథాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.