
తలైవా.. పేదల ముఖ్యమంత్రి!
తలైవా రజనీకాంత్ పేదల ముఖ్యమంత్రి.. అంటూ అభిమానుల కోలాహలం..
చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆయన అభిమానుల ఆకాంక్ష, ఆయన రాజకీయ తెరంగేట్రం ఉంటుందా? లేదా? అన్న మీమాంస రాజకీయ వర్గాల్లోనూ కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. మరి కొందరైతే రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవేవీ పట్టించుకోకుండా రజనీ అభిమానులు మాత్రం చాలా ఖుషీ అయ్యిపోతున్నారు.
అందుకు కారణం ఇటీవల ఐదు రోజుల పాటు అభిమానులను కలుసుకున్న రజనీకాంత్ సమయం ఆసన్నమైనప్పుడు పోరుకు సిద్ధం అవుదాం అన్న ఆయన ఒకే ఒక్క పిలుపు అభిమానుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. అంతే కాదు తమ కథానాయకుడు తమిళనాడు నాయకుడవడం తథ్యం అనే నిర్ణయానికి వచ్చేసిన కొందరు రజనీ వీరాభిమానులు తమకు మంత్రి పదవులు వద్దు, ఎంఎల్‌ఏ, ఎంపీ పదవులు వద్దు, కార్యకర్తలన్న పదవే చాలు.
‘తలైవా మీరు రాజకీయాల్లోకి రండి, పేదల ముఖ్యమంత్రి..’ అంటూ వారు వేసిన పోస్టర్లు రాష్ట్ర ప్రధాన నగరాల్లో వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.