పేదల సంజీవని ఆరోగ్యశ్రీ
► ప్రారంభమై దశాబ్ధం పూర్తి
► వైఎస్సార్ చలువతో లక్షలాది పేదలకు లబ్ధి
వనపర్తి: దశాబ్ధలుగా కార్పెరేట్ వైద్యం చేయించుకోలేక తమ విధిరాత అని రోదిస్తున్న ప్రజానీకానికి పదేళ్ల కిందట వైఎస్ రూపంలో అదృష్టం తలుపుతట్టినట్లయ్యింది. పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి నేటితో పదేళ్లు పూర్తియింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నామని ఏ పేదవాడు బాధపడకూడదనే ధృఢ సంకల్పంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి పురుడు పోశారు.
ఎన్నో వ్యాధులకు డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేక అర్ధాంతరంగా తనువులు చాలించే పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలిచింది. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక వైద్యసేవలు పొంది ఆరోగ్యశ్రీ పథకంతో తమకు పునర్జన్మ లభించిందని నేటికీ వైఎస్సార్‌ను స్మరించుకునే వాళ్లున్నారు.
చరిత్రాత్మకం
దేశ చరిత్రలోనే అరుదైన రికార్డును ఆరోగ్యశ్రీ పథకం సొంతం చేసుకుంది. 2007మార్చి 31న ఉమ్మడి తెలుగు రాష్ట్ర సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఈ పథకంలో 948 రకాల వ్యాధులకు ఉచిత వైద్య సేవలు అందించేలా రూపకల్పన చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు జిల్లా సమన్వయకర్త, జిల్లా మేనేజర్, అడ్మిస్ట్రేషన్ ఆఫీసర్‌తో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 130మంది పథకంలో పనిచేస్తున్నారు. వీరదందరూ ఔట్‌సోరి్సంగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం లక్షా 79వేల 442 మంది వైద్యసేవలు పొందారు.
ఇందుకు గాను ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 474కోట్ల 53 లక్షల 66 వేల 523 కోట్లు ఖర్చుచేసింది. 2007లో మార్చి 31నుంచి 2014 జూన్ 1వరకు లక్షా 2వేల,551 లక్ష మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం రూ. ఖర్చు రూ. 271కోట్ల 70లక్షల 27వేల979 కోట్లు వెచ్చించి. నూతన రాష్ట్రంలో జూన్ 2 నుంచి 2017 మార్చి 30వరకు 76,891లబి్ధపొందగా, ప్రభుత్వం ఖర్చు రూ. 202కోట్ల 83లక్షలు 38వేల 544కోట్లు ఖర్చుచేసింది.
ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ
ఆరోగ్య శ్రీ పథకంలో ప్రధానంగా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వ్యాధుల్లో పదేళ్ల నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 42,348మంది చికిత్సా పొందగా, రెండవ స్థానంలో జాన్‌టోయరీనరి సర్జరీ 23539మంది, తర్వాత స్థానంలో పాలీట్రామా 22,368మంది చికిత్సా చేయించుకున్నారు. అతి తక్కువగా ఆర్గన్ ట్రాన్స్‌లాన్‌టేషన్ ఇప్పటి వరకు ఇద్దరూ ఉపయోగించుకొనగా, రెండో స్థానంలో డర్మటాలాజీకి చెందిన వ్యాధిగ్రస్తులు 42మంది చికిత్స పొందారు.