అంతా బాగుంది.. భేషుగ్గా సేవలు
-
వైద్యాధికారుల మాటలకు
-
వంత పాడిన మంత్రి కామినేని
-
వార్డుల వైపు కన్నెత్తి చూడని వైనం
-
తూతూ మంత్రంగా ప్రభుత్వాస్పత్రి సమీక్షా సమావేశం
కాకినాడ వైద్యం :
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు వైద్య విభాగాధిపతులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశం తూతూమంత్రంగా సాగింది. పేరుకే సమీక్ష అన్న రీతిన ముగిసింది. వైద్యాధికారులు చెప్పగా, మంత్రి ఆలకించి ‘అంతా బాగుంది..ఆస్పత్రిలో బేషుగ్గా పేదలకు సేవలు అందుతున్నా’ యంటూ కితాబిచ్చేశారు. ప్రభుత్వాస్పత్రిలోని సమస్యలను ఒకరిద్దరు వైద్య విభాగాధిపతులు మాత్రమే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పడకల కొరత ఎక్కువగా ఉందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఆస్పత్రి ఆవరణలో రూ.40 కోట్లతో 150 పడకల ఎంసీహెచ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. çస్థలాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని బదులిచ్చారు. అలాగే టీబీ వార్డును మల్టీ స్టోరీడ్ భవనంగా తయారు చేస్తామన్నారు. మహిళా వైద్యుల హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
ఓపీ 3000కు పెరిగింది
ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు, ఆరోగ్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడంతో ఆస్పత్రిలో రోగుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి కామినేని అన్నారు. గతంలో రోజుకు 1800 నుంచి 2,000 వేల వరకూ వచ్చే ఓపీ ఇప్పుడు 3,000 చేరిందన్నారు. సీటీ స్కా¯ŒS యంత్రం కొనుగోలుకు తక్షణమే చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. సర్జికల్, మెడికల్, ఆరో్ధపెడిక్ వార్డుల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS హెచ్.అరుణ్‌కుమార్, సూపరింటెండెంట్ వై.నాగేశ్వరరావు, ఏడీఎంఈ డా. కె.బాబ్జి, డీఎంఅండ్‌హెచ్‌వో చంద్రయ్య, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వార్డుల వైపు కన్నెత్తి చూడని మంత్రి
ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందుతోన్న వైద్య సేవలపై క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉన్నా అటువంటి దిశగా మంత్రి చర్యలు చేపట్టలేదు. కనీసం వార్డులను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది పనితీరును కూడా అంచనా వేయలేదు. కేవలం తూతూ మంత్రంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి వెనక్కి వెళ్లిపోవడంపై ౖవైద్యులే పెదవి విరిచారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి శిశువు అపహరణ కేసు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. మంత్రి ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా వైద్యాధికారులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ మానవతా దృక్పధంతో బా«ధితురాలిని పరామర్శించడానికి మంత్రి వార్డుకు వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది.