
కొణిదెల అండ్ కామినేని ఫ్యామిలీలో దీపావళి సంబరాలు మంగళవారమే మొదలయ్యాయి. రామ్‌చరణ్ (చెర్రీ) అత్తారింట్లో మంగళవారం ప్రీ–దివాలి గెట్ టుగెదర్ జరిగింది. చెర్రీ అత్తమామలు శోభన–అనిల్ కామినేని ఫ్యామిలీ.. చిరంజీవి ఫ్యామిలీకి దీపావళి పార్టీ ఇచ్చారు.
చిరు ఫ్యామిలీతో పాటు కొంతమంది బంధువులు, స్నేహితులు ఈ పార్టీలో సందడి చేశారు. రామ్‌చరణ్–ఉపాసన దంపతులు, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్... త్వరలో చిరు హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ తీయనున్న దర్శకుడు సురేందర్‌రెడ్డి ఫ్యామిలీ, రామ్‌చరణ్ హీరోగా ‘రంగస్థలం’ తీస్తున్న దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ పాల్గొన్నారు.