స్టైలిష్‌ లుక్‌లో ఉపాసన.. డ్రెస్‌ ధరెంతో తెలుసా? | Upasana Wears Rs 42,000 Dress | Sakshi
Sakshi News home page

Upasana: సింప్లీ సూపర్బ్‌ అనిపించిన ఉపాసన.. డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?

Sep 11 2023 2:10 PM | Updated on Sep 11 2023 2:59 PM

Upasana Wears Rs 42,000 Dress - Sakshi

లైట్‌ పింక్‌ డ్రెస్‌లో ఎంబ్రాయిడరీ జాకెట్‌తో మెరిసింది. ఈ జాకెట్‌పై బ్లాక్‌ కలర్‌లో పిల్లి డిజైన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ డ్రెస్‌.. హేలీ మెన్జీస్‌ డిజైనర్‌కు సంబంధించి

క్లీంకార రాకతో రామ్‌చరణ్‌- ఉపాసనల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కూతురు పుట్టినప్పటి నుంచి చరణ్‌ సినిమాలు-పర్సనల్‌ లైఫ్‌ను మరింత బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాడు. మరోవైపు ఉపాసన.. తన పూర్తి సమయాన్ని కూతురికే వెచ్చిస్తోంది. ఈ మధ్య చరణ్‌- ఉపాసన వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా! ఓ పెళ్లి కోసం వీరు పారిస్‌ వెళ్లారు. ఈ క్రమంలో వీరు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కారు దిగి నడుచుకుంటూ వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ సమయంలో ఎంతో కూల్‌గా డిఫరెంట్‌ ఫ్యాషన్‌ లుక్‌లో కనిపించింది ఉప్సీ. లైట్‌ పింక్‌ డ్రెస్‌లో ఎంబ్రాయిడరీ జాకెట్‌తో మెరిసింది. అయితే ఈ డ్రెస్‌.. హేలీ మెన్జీస్‌ డిజైనర్‌కు సంబంధించిన పాంథర్‌ కాటన్‌ జాక్వర్డ్‌ అని తెలుస్తోంది. దీని ధర రూ.42 వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చరణ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు గేమ్‌ ఛేంజర్‌ మూవీ చేస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.

చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement