మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే అయోధ్య బలరామున్ని దర్శించుకున్నారు. తన తాతయ్య, నానమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆలయం ప్రారంభించాక ఉపాసన తొలిసారి అయోధ్య రామాలయాన్ని సందర్శించారు.
(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!)
తాజాగా తన అయోధ్య పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. తన కోరిక తీరిందని.. ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన.. దివ్యమైన అనుభూతి అని తెలిపింది. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని రాసుకొచ్చింది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment