కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయినా, పిల్లలయినా ఏదో హడావుడిగా కానివ్వడం లేదు. అందుకు రామ్‌చరణ్- ఉపాసన దంపతులే ఉదాహరణ. పెళ్లయిన పదేళ్ల తర్వాతే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. పిల్లల కోసం ఎవరెంత పోరు పెడుతున్నా సరే లెక్క చేయలేదు, ఇదే కరెక్ట్ సమయం అనిపించేంతవరకు వెయిట్ చేశారు. ఆ తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారు. అలా గతేడాది క్లీంకారకు జన్మనిచ్చారు.
మనల్ని మనమే పట్టించుకోవాలి
తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. 'మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను.
సెకండ్ ప్రెగ్నెన్సీకి రెడీ..
జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయం. నేను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నాను. నా పక్కనున్న మేడమ్ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నేనేమీ బాధపడలేదు. అది నా ఇష్టం. అంతేకాదు, నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నాను' అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఉపాసన మరో శుభవార్త చెప్పబోతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రెండో రౌండ్‌కు రెడీ అంటూ ఓ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఉప్సీ.
Comments
Please login to add a commentAdd a comment