చరణ్‌.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్‌ | Upasana Konidela: My support, While I Was at Work | Sakshi
Sakshi News home page

Upasana: ఉపాసన విదేశీ ట్రిప్పు.. తోడుగా వెళ్లిన రామ్‌ చరణ్‌..

Published Wed, May 22 2024 5:32 PM | Last Updated on Wed, May 22 2024 5:53 PM

Upasana Konidela: My support, While I Was at Work

వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్‌ దేశానికి వెళ్లింది. షూటింగ్స్‌తో ఎంతో బిజీగా ఉండే చరణ్‌ పనులన్నీ పక్కనపెట్టి భార్యతో సహా వెళ్లాడు. తమ పాప క్లీంకారను కూడా తీసుకెళ్లారు.

ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనక కూడా ఒక మగవాడు ఉంటాడని ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఎంత వైరలయ్యాయో తెలిసిందే! ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, అండగా నిలబడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెప్పింది ఉపాసన. కేవలం సూక్తులు చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూపిస్తున్నారీ జంట.

ఉపాసన వెంటే..
ఆ మధ్య చరణ్‌ ఆస్కార్‌ కోసం అమెరికాకు వెళ్తే కడుపుతో ఉన్నా సరే ఉపాసన అతడి వెంటే వెళ్లింది. ఇప్పుడు ఉప్సీ వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్‌ దేశానికి వెళ్లింది. షూటింగ్స్‌తో ఎంతో బిజీగా ఉండే చరణ్‌ పనులన్నీ పక్కనపెట్టి భార్యతో సహా వెళ్లాడు. తమ పాప క్లీంకారను కూడా తీసుకెళ్లారు. 

గర్వంగా ఉంది..
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'చరణ్‌ నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నేను చేసే పనులకు సపోర్ట్‌గా నిలబడుతున్నావు. తండ్రిగానూ బాధ్యత నెరవేరుస్తున్నావు. అలాగే ఈ మీటింగ్‌ను ప్రత్యేకంగా మార్చిన మహిళామణులందరికీ థ్యాంక్స్‌' అంటూ మూడు ఫోటోలు షేర్‌ చేసింది. అందులో ఉపాసన కెమెరా వైపు పోజిస్తే చరణ్‌ మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుదిరిగి నిల్చున్నాడు. ఈ పిక్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

 

 

చదవండి: కేకేఆర్‌ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్‌.. చూసుకోకుండా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement