
వెలుగులు విరజిమ్మే దీపావళి పండగను మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. కేవలం కుటుంబసభ్యుల మధ్యే కాకుండా ఇండస్ట్రీలోని అత్యంత దగ్గరి స్నేహితులను కూడా పార్టీకి పిలిచారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేశ్ తమ కుటుంబంతో పార్టీకి విచ్చేసి సందడి చేశారు.
క్లీంకార పుట్టాక తొలి దీపావళి
క్లీంకార పుట్టిన తర్వాత రామ్‌చరణ్- ఉపాసన దంపతులు జరుపుకుంటున్న తొలి దీపావళి కావడంతో ఈసారి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ఇంట్లో ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీనికోసం స్టార్ హీరోలు కుటుంబసమేతంగా రావడం విశేషం. ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో, మహేశ్ బాబు.. నమ్రతతో కలిసి హాజరయ్యారు. పార్టీలో ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.
నలుగురు హీరోలు ఒకేచోట
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నలుగురు హీరోలు ఒకేచోట కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ పార్టీకి మంచు లక్ష్మి సైతం హాజరైంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే మహేవ్‌బాబు గుంటూరు కారం, రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. వెంకటేశ్ సైంధవ్ , ఎన్టీఆర్ దేవర సినిమాలతో బిజీగా ఉన్నారు.
చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment