
మెగా ఫ్యామిలీ అంతా ఈసారి సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోనున్నారు. చరణ్ కూతురికి ఇదే తొలి పండగ కావడంతో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్‌లో కాకుండా మరో చోట జరగనున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ‘సైంధవ్’మూవీ రివ్యూ)
గతేడాది జూన్‌లో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టుకున్నారు. ఈ పాపకు ఇప్పుడు జరగబోయే సంక్రాంతి ఫస్ట్ టైమ్. కాబట్టి ఈసారి బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే చరణ్ దంపతులు, అకీరా నందన్ తదితరులు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.
ఇకపోతే చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షెడ్యూల్ జరుగుతోంది. సంక్రాంతి కాబట్టి చిన్న విరామం తీసుకున్నారు. పండగ ముగిసిన తర్వాత మళ్లీ షూటింగ్ బిజీలో పడిపోతాడు. మరోవైపు చిరు కూడా తన కొత్త మూవీ బిజీలో ఉన్నారు. ఇకపోతే ఈసారి బెంగళూరులో జరిగే సంక్రాంతి వేడుకలకు దాదాపు మెగా హీరోలందరూ కూడా హాజరుకానున్నారని సమాచారం.
(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)
Man Of Masses #RamCharan off 🛫 for Sankranti Occasion with Family ❤️ Visuals from Hyderabad Airport. pic.twitter.com/n0EWvUOFgK
— Ujjwal Reddy (@MEHumanTsunaME) January 13, 2024