క్లీంకారకు కేర్‌ టేకర్‌గా సావిత్రి.. ఆమె జీతం ఎంతో తెలిస్తే.. | Ram Charan Daughter Klin Kaara Care Taker Savithri Salary Details - Sakshi
Sakshi News home page

క్లీంకారకు కేర్‌ టేకర్‌గా సావిత్రి.. ఆమెనే ఎందుకు ఎంపిక చేశారంటే

Published Sun, Feb 4 2024 11:31 AM | Last Updated on Mon, Feb 5 2024 7:33 PM

Ram Charan Daughter Klin Kaara Care Taker Savithri Salary - Sakshi

రామ్‌ చరణ్‌- ఉపాసనల గారాల పట్టి క్లీంకార జన్మించిన సమయం నుంచి మెగాఫ్యామిలీకి బాగా కలిసొచ్చిందని అందరూ చెబుతున్న మాట.  రామ్‌ చరణ్‌ RRR చిత్రానికి ఆస్కార్‌ అవార్డు దక్కితే తాజాగా చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డు దక్కింది. మెగా ప్రిన్సెస్‌ రాకతో వారి కుటుంబంలో ఎప్పుడూ సందడిగానే ఉంది. దీంతో వారి ఫ్యాన్స్‌ కూడా సంబరపడిపోతుంటారు.

తాజాగా మెగా వారసురాలు అయిన క్లీంకారను చూసుకునేందుకు నానీ (కేర్ టేకర్ లేదా ఆయా)ను నియిమించుకున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఆమె పేరు సావిత్రి కాగా, గతంలో  బాలీవుడ్‌ హీరోయిన్‌  కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు అయిన తైమూర్‌కు  సావిత్రి కేర్‌ టేకర్‌గా పనిచేసింది. ఆపై షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె కేర్‌ టేకర్‌గా కొనసాగింది. ఇప్పుడు మెగా ప్రిన్సెస్‌ అయిన ​క్లీంకార ఆలనా పాలనా చూసుకునేందుకు సావిత్రిని వారు నియిమించుకున్నారట.

చాలా రోజుల క్రితమే రామ్‌ చరణ్‌ సొంత ఇంటిని నిర్మించుకుని షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గేమ్‌ ఛేంజర్‌తో పాటు పలు ప్రాజెక్ట్‌ల వల్ల ఎప్పుడూ షూటింగ్‌ బిజీలో ఉంటారు. ఉపాసన కూడా ఆపోలో ఆస్పత్రిలో తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిత్యం బిజీగానే ఉంటారు. ఆ సమయంలో క్లీంకార కూడా ఎప్పుడూ ఉపాసన వెంటే ఉంటుంది. దీంతో పాపను చూసుకునేందుకు సావిత్రి అయితే బాగుంటుందని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కూతురి కోసం లక్షలు లక్షలు వెచ్చించి ఇంట్లోనే కొత్త ప్రపంచాన్ని నిర్మించారు ఉపాసన. చిన్నపిల్లలను సరిగ్గా అర్థం చేసుకుంటూ వారి ఆలనా పాలనను చూసుకునే సామర్థ్యం సావిత్రిలో ఉందని గతంలో కరీనా కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయింది. ప్రస్తుతం క్లీంకారకు కేర్‌టేకర్‌గా ఉన్న సావిత్రికి  నెలకు లక్షన్నర జీతం  ఇస్తున్నట్లు సమాచారం.

కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఒక ఆలయానికి రామ్‌చరణ్‌ దంపతులు వెళ్లారు. అప్పుడు ఓ పర్సనల్ పని మీద ముంబై వచ్చారని చరణ్ టీమ్​ మెంబర్ ఒకరు తెలిపారు. అప్పుడు సావిత్రి కూడా వారితో ఉండటం గమనించవచ్చు. మరొక కార్యక్రమంలో కూడా క్లీంకారతో ఆమె కనిపించడంతో మెగా వారసురాలికి కేర్‌ టేకర్‌గా సావిత్రి ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై రామ్‌ చరణ్‌ దంపతులు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement