యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ! | Apollo Hospitals Group launches In Ayodhya | Sakshi
Sakshi News home page

యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ...

Published Mon, Mar 11 2024 5:12 PM | Last Updated on Mon, Mar 11 2024 7:12 PM

Apollo Hospitals Group launches In Ayodhya - Sakshi

మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్‌ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. 

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్‌లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్‌లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్‌తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్‌తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు.

దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement