Prathap C. Reddy
-
యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ!
మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్‌తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్‌తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'వైద్యరంగంలో ఆధునిక భారత ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా పరిగణించబడుతున్న ప్రతాప్ సి. రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ట్వీట్ చేశారు. Warm greetings on the 91st birthday to Sri Pratap C Reddy Garu, Founder-Chairman of Apollo hospitals, a revered fatherly figure in the medical fraternity and widely regarded as an architect of modern Indian healthcare. May God bless him with a happy and healthy life ahead. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 5, 2022 చదవండి: (Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం) -
తాత గురించి ఉపాసన వీడియో పోస్ట్
సాక్షి, హైదరాబాద్ : మెగా పవర్‌స్టార్ రాంచరణ్‌ను వివాహం చేసుకుని మెగా ఫ్యామిలీ కోడలిగా మారిన తర్వాత ఉపాసన బాధ్యతలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో నిత్యం పలు అంశాలను, ఉపయోగకర విషయాలను ప్రస్తావించే ఉపాసన తాజాగా తన తాత (ప్రతాప్ రెడ్డి) కల ఇదేనంటూ ఓ వీడియోను తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. సాధ్యమైనంత మందికి ఆరోగ్యకర జీవితాన్ని ఇవ్వాలని తాత కలలు కన్నారని ట్వీట్లో తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని తాత భావించారని.. ఇందులో భాగంగానే అపోలో హాస్పిటల్స్ స్థాపించి హెల్త్ కేర్ మోడల్‌కు శ్రీకారం చుట్టారని ట్విటర్ ద్వారా ఉపాసన వివరించారు. -
అపోలో షుగర్ క్లినిక్‌లు
మధుమేహ బాధితుల కోసం ఏర్పాటు అపోలో హాస్పిటల్స్ {Vూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి న్యూఢిల్లీ: మధుమేహ బాధితులకు ఇతర వ్యాధులు రాకుండా నియంత్రించేందుకు షుగర్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. మధుమేహం ప్రభావంతో ఇతర వ్యాధులు సోకకుండా బాధితులను సంరక్షిస్తామన్నారు. డయాబెటీస్ తల నుంచి పాదాల వరకు.. గుండె, మెదడు, కిడ్నీ ఇలా శరీరంలోని ప్రతీ అవయవంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. అపోలో హాస్పిటల్స్, సనోఫి సంస్థ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ దీపక్ చోప్రా సహకారంతో అపోలో షుగర్స్ క్లినిక్ ఆధ్వర్యంలో ‘డిసీజ్ ఫ్రీ ఫర్ డయాబెటీస్’ కార్యక్రమాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. డయాబెటిస్, గుండె, కేన్సర్, ఇన్ఫెక్షన్లతో ఏటా కోట్ల మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. కేవలం ఇన్సులిన్, మందులే కాకుండా జీవనశైలి, ఆహార నియమాలు, యోగా, ధ్యానం కూడా షుగర్ నియంత్రణకు సహకరిస్తుందన్నారు. తొలి దశలో 50 అపోలో షుగర్ క్లినిక్‌లను అక్టోబరు 30వతేదీ లోపు ఏర్పాటు చేస్తామన్నారు. క్లినిక్‌ల ద్వారా డయాబెటిక్ నిపుణులు సూచనలు, సలహాలతోపాటు ఆహార నియమాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. వైజాగ్, విజయవాడలో సుగర్ క్లినిక్‌లు... వైజాగ్, విజయవాడలో అపోలో షుగర్ క్లినిక్స్‌ను నెలకొల్పనున్నట్లు ఆపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతారెడ్డి చెప్పారు. మధుమేహం ఉన్నా ఇబ్బంది లేకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు అపోలో షుగర్ క్లినిక్ దోహదపడుతుందన్నారు. జీవన శైలి, నియమిత ఆహారం, వ్యాయామం, ధ్యానం, సరైన మందులతో హెచ్‌బీఏ 1సీ పరీక్ష ద్వారా 90 రోజుల్లో సాధారణస్థితికి వచ్చేలా సమగ్ర షుగర్ ప్యాకేజీని తయారు చేశామన్నారు. -
అందుబాటు ధరలో మెరుగైన వైద్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ వ్యయాలతో మెరుగైన వైద్యం అందించే దిశగా ఎప్పటికప్పుడు అధునాతన సేవలు అందుబాటులోకి తెస్తున్నామని హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. ఇందుకు ఉద్దేశించిన ఈ-ఐసీయూ సేవల గురించి శనివారం ఇక్కడ క్రిటికేర్ అపోలో 2014 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన విలేకరులకు వివరించారు. మారుమూల ప్రాంతాల ఆస్పత్రులను అపోలోకి అనుసంధానించడం ద్వారా అక్కడ చికిత్స పొందుతున్న వారికి స్పెషలిస్టు సర్వీసులను అందించేందుకు ఈ-ఐసీయూ తోడ్పడుతుందన్నారు. దీనివల్ల వీడియో కాన్పరెన్సింగ్ వంటి సదుపాయంతో పేషంటు ఆరోగ్య పరిస్థితిని అప్పటికప్పుడు అంచనా వేసి, స్థానిక వైద్యులకు తగు సలహాలు ఇచ్చేందుకు వీలవుతుందని చెప్పారు. ఫలితంగా పేషంట్లకు చికిత్స సమయం, వ్యయాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్ దశ కింద 50 పడకలను అనుసంధానించామని ఆయన వివరించారు. ఈ నెల 27న అపోలో 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈ-ఐసీయూ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేగలమన్నారు. దీనికి ఫిలిప్స్ హెల్త్‌కేర్ సాంకేతిక సహకారం అందిస్తోందని వివరించారు. భారత్ కేవలం పర్యాటకానికి హబ్‌గా మాత్రమే కాకుండా హెల్త్‌కేర్ హబ్‌గా కూడా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. వైద్య సేవలు మెరుగవ్వాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రజల భాగస్వామ్యం కీలకమని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కేన్సర్ వంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స వ్యయాలు గణనీయంగా తగ్గుతాయన్నారు.