
మెగా కోడలు ఉపాసన ఫుల్ సంతోషంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణ్‌లు ఉన్నారు. చిరంజీవికి ఈ మధ్యే పద్మవిభూషణ్ రాగా ఆమె తాతయ్య, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డికి 14 ఏళ్ల క్రితమే ఈ పురస్కారం వరించింది. సోమవారం (ఫిబ్రవరి 5న) ఈయన 91వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చెన్నైలో జన్మదినోత్సవ వేడుక జరిపారు.
నేనే ఎక్కువ మాట్లాడుతా
ఈ సెలబ్రేషన్స్ వేడుకలో ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్‌ను డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాసన కొందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. చరణ్ వింటూ ఉంటాడు. నేను బయటకు వెళ్లినప్పుడు అతడు క్లీంకారను చూసుకుంటాడు. తను బయటకు వెళ్తే నేను చూసుకుంటాను.
జెలసీగా అనిపిస్తుంది
ఒక విషయం గురించైతే నాకు మాట్లాడటానికి కూడా ఇష్టం లేదు (నవ్వుతూ). ఆడపిల్లలు నాన్నకూచి అంటుంటారు కదా.. అది నిజం. నా విషయంలోనూ అదే జరిగింది. చరణ్‌ను చూడగానే క్లీంకార ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో కనురెప్పలు ఆడిస్తుంది. అది చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. అయితే చరణ్ తనను చాలా కేరింగ్‌గా చూసుకుంటాడు. అతడు నాకు భర్త మాత్రమే కాదు స్నేహితుడు కూడా! అన్ని విషయాలు నాతో పంచుకుంటాడు.
నాతోనే కెమిస్ట్రీ బాగుంటుంది
కొన్నిసార్లు అతడి సినిమాల్లో హీరోయిన్‌తో కలిసి చేసిన సీన్లు చూసినప్పుడు ఏంటిదని అడిగేదాన్ని. ఇది నా వృత్తి. అర్థం చేసుకో.. దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే! అని చెప్పేవాడు. సరేలే అని వదిలేసేదాన్ని. ఏదో సరదాగా అడుగుతా కానీ, అతడు ఏ హీరోయిన్‌తో నటించినా పట్టించుకోను. హీరోయిన్స్ కన్నా నాతోనే తన కెమిస్ట్రీ బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా చరణ్- ఉపాసనల పెళ్లి 2012లో జరిగింది. గతేడాది వీరు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లలితా సహస్రనామాల్లో ఒకటైన క్లీంకార అనే పేరును కూతురికి నామకరణం చేశారు.
చదవండి: సారాంశ్.. రియల్ లైఫ్ స్టోరీ.. ఒక్కగానొక్క కొడుకు మరణం.. పీక్కుతిన్నారు!
Comments
Please login to add a commentAdd a comment