ప్రముఖ బిజినెస్‌మెన్ ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయముంది. కానీ అప్పుడే పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఆల్‌రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, పాప్ సింగర్ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.
కునుకు తీసిన భార్య..
బాలీవుడ్ తారలు సైతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనే తిష్ట వేశారు. ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాల కోసం టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జామ్‌నగర్‌కు వెళ్లారు. విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది.
అవార్డు ఇచ్చేయాల్సిందే!
ఇది చూసిన జనాలు ఇంక ఆలస్యం చేయొద్దు, చరణ్‌కు బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. భార్యకు సేవ చేయడం చరణ్‌కు కొత్తేమీ కాదు. ఇంటి పనుల్లో సాయం చేయడం దగ్గరి నుంచి షాపింగ్‌కు వెళ్తే బ్యాగులు మోయడం వరకు అన్నీ చేస్తుంటాడు. ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని తు.చ తప్పకుండా పాటిస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా కించిత్తు గర్వం లేకుండా భార్యకు సేవ చేస్తున్న చరణ్‌ను పురుషులంతా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు మహిళామణులు.
🥹❤️@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/dmGBnk7V5Q
— Raees (@RaeesHere_) March 1, 2024
చదవండి: ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే
Comments
Please login to add a commentAdd a comment