Upasana Konidela Shared Video Of Her Daughter Klin Kaara Special Room, Goes Viral - Sakshi
Sakshi News home page

Klin Kaara Konidela Special Room: మెగా ప్రిన్సెస్ కోసం స్పెషల్‌ రూమ్‌.. ఎంత బాగుందో..

Published Sun, Jul 16 2023 12:09 PM | Last Updated on Sun, Jul 16 2023 2:45 PM

Upasana Konidela Shared Video Of Her Daughter Special Room - Sakshi

మెగా కోడలు, రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ఇటీవల ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు క్లీంకార అనే నామకరణం చేశారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో తొలి నుంచి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. డెలీవరీ సమయంలో కూడా రామ్‌ చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అంతా పక్కనే ఉన్నారు. బారసాల కార్యక్రమాన్ని కూడా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ ఇంట ఇప్పటికీ ఆ పండుగ వాతావరణం కొనసాగుతూనే ఉంది.

తన ముద్దుల తనయ విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కుమార్తె చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఇంటీరియర్‌ సిద్ధం చేయించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ పవిత్రా రాజారామ్‌ నేతృత్వంలో క్లీంకార కోసం ఓ స్పెషల్‌ రూమ్‌ని డిజైన్‌ చేయించారు. 

అమ్రాబాద్ ఫారెస్ట్‌, వేదిక్‌ హీలింగ్‌ అంశాలను ప్రేరణగా తీసుకొని అత్యుత్తమ వాతావరణంలో చిన్నారి పెరిగేలా ఈ ఇంటీరియర్‌ను సిద్దం చేయించినట్లు ఉపాసన పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోని ట్వీటర్‌లో షేర్‌ చేస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో తన కూతురిని  పెంచడానికి ఎంతో  ఆనందిస్తున్నానని రాసుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement